Manu Choudary IAS | కొమురవెల్లి, మార్చి 29 : మండలంలోని గురువన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మార్చి 15న ఏఐ( ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభానికి జిల్లా కలెక్టర్ మనుచౌదరి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాఠశాల ఊరు చివర ఉండటంతో విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని మనుచౌదరికి గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు తెలుపడంతో స్పందించిన కలెక్టర్ విద్యార్థులకు బస్సును కేటాయిస్తామని తెలిపారు.
ఇచ్చిన మాట ప్రకారం గురువన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బస్సు అందజేశారు. ఈ మేరకు పాఠశాల పేరు మీద బస్సు రిజిస్ట్రేషన్ చేసి సంబంధిత పత్రాలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవాళ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బోజ్జ రాజుకు హెచ్వో రామస్వామి అందజేశాడు. ఈ కార్యక్రమంలో (డీటీవో) డిస్ట్రిక్ ట్రాన్స్పోర్ట్ అధికారి కొండల్రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Kathmandu | నేపాల్లో హింస.. 100 మంది అరెస్ట్
Chilli Farming | సస్యరక్షణ చర్యలతోనే మిర్చి అధిక దిగుబడులు: డాక్టర్ ఎం వెంకటేశ్వర్ రెడ్డి
Heart Health | ఈ ఆహారాలను తింటే మీకు గుండె పోటు అసలు రాదు.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.