లండన్: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) తీవ్రంగా గాయపడ్డాడు. ట్రైనింగ్ సెషన్ సమయంలో.. బంతి అతని ముఖానికి తాకింది. దీంతో అతని ముఖం వాచిపోయింది. దెబ్బ తగిలిన ఫోటోను స్టోక్స్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. క్రికెట్ బంతి దెబ్బ ఎలా ఉంటుందో చూడాలని తన ఫోటోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఫోటోను పరిశీలిస్తే, స్టోక్స్ కుడి కన్ను వాచినట్లు ఉన్నది. చెంప, పెదవు కూడా దెబ్బతిన్నాయి. ముక్కు రంధ్రంలో దూది పెట్టి ఉన్న ఫోటోను స్టోక్స్ తన ఇన్స్టాలో పోస్టు చేశాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్కు ఇంగ్లండ్ కెప్టెన్గా స్టోక్స్ బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ సిరీస్లో ఆస్ట్రేలియా 4-1 తేడాతో విజయం సాధించింది.