Hyderabad | పెండ్లి చేసుకుంటానని నమ్మించి.. 6.3లక్షలకు టోకరా వేసిన మహిళ!
Hyderabad | మ్యాట్రీమోనీ వెబ్సైట్లో ప్రొఫైల్ చూసి పెండ్లి చేసుకుంటానంటూ ముందుకొచ్చిన ఓ మహిళ.. తాను స్టాక్ ట్రేడింగ్ చేస్తున్నానని అందులో మంచి లాభాలొస్తాయి, మన భవిష్యత్తు కోసం మీరు ఇన్వెస్ట్ చేయండంటూ నమ్మించి నగరానికి చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగికి రూ. 6.3 లక్షలు బురిడీ కొట్టించింది.
Hyderabad | సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): మ్యాట్రీమోనీ వెబ్సైట్లో ప్రొఫైల్ చూసి పెండ్లి చేసుకుంటానంటూ ముందుకొచ్చిన ఓ మహిళ.. తాను స్టాక్ ట్రేడింగ్ చేస్తున్నానని అందులో మంచి లాభాలొస్తాయి, మన భవిష్యత్తు కోసం మీరు ఇన్వెస్ట్ చేయండంటూ నమ్మించి నగరానికి చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగికి రూ. 6.3 లక్షలు బురిడీ కొట్టించింది. ఓల్డ్ అల్వాల్‌లో నివాసముండే బాధితుడు ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. షాది.కామ్‌లో మీ ప్రొఫైల్ చూశానంటూ నందితారెడ్డి అనే పేరుతో ఓ యువతి బాధితుడిని కాంటాక్టు అయ్యింది.
ఇద్దరు వాట్సాప్ నెంబర్లు మార్చుకొని, 3 నెలల పాటు చాటింగ్ చేశారు. తనది విజయవాడ అని ప్రస్తుతం యూకేలో ఉన్నానని క్వాడ్కోడ్ఎఫ్ఎక్స్ అనే ట్రేడింగ్ కంపెనీలో పనిచేస్తున్నాననిపరిచయం చేసుకుంది. వీడియో కాల్స్‌లోనూ బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడింది. మనం పెండ్లి చేసుకున్న తరువాత ఆర్ధికంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఇప్పటి నుంచి ఆర్ధికంగా బలపడాలని నీతులు చెప్పింది. తాను స్టాక్ ట్రేడింగ్‌లో ఎక్స్పర్ట్నని, తమ కంపెనీ క్వాడ్కోడ్ ఎఫ్ఎక్స్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటూ సూచించింది.
పెండ్లి చేసుకోబోతున్నానని, తమ మంచికే చెబుతుందనే భరోసాతో బాధితుడు ఆమె చెప్పినట్లు యాప్‌ను డౌన్లోడ్ చేసి మొదట రూ.50వేలు పెట్టుబడి పెట్టాడు. స్క్రీన్‌పై అసలుతో పాటు లాభం కన్పించింది. దీంతో అది నిజమని నమ్ముతూ దఫ దఫాలుగా రూ.6.35 లక్షలు పెట్టుబడి పెట్టాడు. స్క్రీన్‌పై అసలుతో పాటు లాభాలు రూ.20 లక్షలు కన్పిస్తున్నాయి, వాటిని విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నించడంతో 30 శాతం ట్యాక్స్ కడితేనే విత్ డ్రా చేసుకోవడానికి అవకాశముంటుందని సూచించారు. ట్యాక్స్ మినహాయించుకొని, మిగతా వాటిని తన ఖాతాకు బదిలీ చేయాలని కోరినా అలా కుదరదంటూ సెల్‌ఫోన్ స్వీచాఫ్ చేశారు. దీంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

