OTT | ఈ వారం ఓటీటీల్లో వినోదాల విందు.. 15కిపైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్కు రెడీ
OTT | ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించినట్లే, ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా వినోద ప్రియులకు కొత్త కంటెంట్‌తో సందడి చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో డిజిటల్ స్ట్రీమింగ్కు ఆదరణ పెరగడంతో, కొత్త సినిమాలు మాత్రమే కాకుండా పాత హిట్ చిత్రాలు, ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌లు వరుసగా ఓటీటీల్లోకి వస్తున్నాయి.
OTT | ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించినట్లే, ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా వినోద ప్రియులకు కొత్త కంటెంట్‌తో సందడి చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో డిజిటల్ స్ట్రీమింగ్కు ఆదరణ పెరగడంతో, కొత్త సినిమాలు మాత్రమే కాకుండా పాత హిట్ చిత్రాలు, ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌లు వరుసగా ఓటీటీల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇతర భాషల చిత్రాలు తెలుగు డబ్బింగ్లో అందుబాటులోకి రావడం మూవీ లవర్స్‌కు అదనపు ఆకర్షణగా మారింది. ఈ వారం సుమారు 15కిపైగా సినిమాలు, పలు వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు సిద్ధమవ్వడంతో ఓటీటీ ప్రేక్షకులకు పండగ వాతావరణం నెలకొంది.
నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలో అంతర్జాతీయ కంటెంట్ :
నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం అంతర్జాతీయ కంటెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. క్వీన్ ఆఫ్ చెస్ (ఇంగ్లీష్ మూవీ), సాల్వడార్ (స్పానిష్ సిరీస్), ట్రాన్స్ఫార్మర్స్ వన్ (యానిమేటెడ్ మూవీ), యో బెస్టీ (హాలీవుడ్ మూవీ) ఫిబ్రవరి 6 నుంచే స్ట్రీమింగ్ అవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫైండింగ్ హార్మోనీ (ఇంగ్లీష్ సినిమా), ఎల్ఓఎల్ (ఇంగ్లీష్ సిరీస్), వయోలెంట్ ఎండ్స్ (హాలీవుడ్ మూవీ) ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. యాక్షన్, డ్రామా అభిమానులకు ఇవి మంచి ఆప్షన్లుగా నిలుస్తున్నాయి.
జీ5, సన్ నెక్ట్స్, ఇతర ప్లాట్ఫామ్ల్లో ..
జీ5లో హిందీ సిరీస్ షాబాద్ స్ట్రీమింగ్కు రాగా, తెలుగు డబ్బింగ్ మూవీ పరాశక్తి కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సన్ నెక్ట్స్‌లో తెలుగు సినిమా నీలకంఠ రిలీజ్ కావడంతో థియేటర్లలో మిస్ అయిన వారికి మంచి ఛాన్స్ లభించింది. అదనంగా హెచ్‌బీవో మ్యాక్స్‌లో బాయ్స్ గో టూ జూపిటర్ (యానిమేషన్), ముబీలో లా గ్రేజియా, హులులో స్పిట్స్‌విల్లే, సోనీ లివ్‌లో జాజ్ సిటీ (హిందీ సిరీస్), టెంట్ కోట్టాలో కోంబుసివీ (తమిళ సినిమా) స్ట్రీమింగ్ అవుతున్నాయి.
‘ది రాజా సాబ్’ ఓటీటీలో స్పెషల్ అట్రాక్షన్…
ఈ వారం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన రిలీజ్ ది రాజా సాబ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ ఫాంటసీ హారర్ కామెడీ థ్రిల్లర్ ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, ప్రభాస్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. వింటేజ్ ప్రభాస్ స్టైల్, డ్యాన్స్‌లు, కామెడీ టైమింగ్‌కు మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉండటం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Amazon
- Jio HotStar
- netflix
- ott
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

