Rashmika | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం AA22xA6 దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ టీమ్ పని చేస్తుండటం విశేషం. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కథానాయికగా ఖరారవ్వడంతో మూవీపై క్రేజ్ మరింత పెరిగింది. అల్లు అర్జున్ ఇందులో రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడన్న ప్రచారం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది.
తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది. నేషనల్ క్రష్ రష్మిక మందానా ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అయినట్లు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ముంబయిలో జరుగుతున్న కొత్త షెడ్యూల్లో రష్మికతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రష్మిక పాత్ర విలన్ ఛాయలతో ఉండనుందనే టాక్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కథలో కీలక మలుపులు తిప్పే పాత్రలో ఆమె కనిపించనుందనే ప్రచారం సినిమాపై హైప్‌ను మరింత పెంచుతోంది.
అల్లు అర్జున్–రష్మిక కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అన్న ముద్ర ఉంది. ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప 2: ది రూల్’ చిత్రాల్లో వీరిద్దరి జోడీ సంచలన విజయాలు అందుకుంది. అలాంటి హిట్ పెయిర్ ఇప్పుడు మరోసారి కలిసి నటిస్తుండటం ఒక ఎత్తయితే, ఈసారి రష్మిక హీరోకు ప్రతినాయకురాలిగా కనిపించనుందన్న వార్త మరింత ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లు రొమాంటిక్ జంటగా అలరించిన ఈ జోడీ ఇప్పుడు సరికొత్తగా కనిపించనుందనే టాక్ అభిమానుల్లో కొత్త ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా కీలక పాత్రల్లో నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. అలాగే రమ్యకృష్ణ, యోగి బాబు, జిమ్ సర్భ్ వంటి ప్రముఖ నటులు కూడా భాగమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు నెలరోజుల పాటు సాగే ముంబయి షెడ్యూల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు, కీలక కథా మలుపులను చిత్రీకరించనున్నట్లు సమాచారం. సినిమా విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న యోచనలో మేకర్స్ ఉన్నట్లు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి.