CMRF | రాయపోల్, జూన్ 16 : సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకు ఎంతో వరం లాంటిదని దౌల్తాబాద్ మండల తాజా మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సర్వ్ గారి యాదవ రెడ్డి అన్నారు.
సోమవారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి ఆదేశాల మేరకు దౌల్తాబాద్ మండలంలోని
మల్లేశంపల్లి గ్రామానికి చెందిన శివంది ముత్యాలుకు రూ.23000, కుమ్మరి అనితకు రూ.18000 పాతూరి రాములుకు రూ.12000 చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన ప్రతి ఒక్కరూ అక్కడ చెల్లించిన డబ్బులను మళ్లీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తీసుకునే అవకాశం ఉందన్నారు. అలాంటివారు సీఎంఆర్ పథకానికి దరఖాస్తు చేసుకుంటే తగిన సహాయం అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రమేష్ గౌడ్, భాస్కర్, పనస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Inter Results | ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఫస్టియర్‌లో 67.. సెకండియర్‌లో 50శాతం పాస్
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Narsimhulapeta | ఖాజామియాకు ఆర్థిక సాయం అందజేత