Harish Rao | సీఎం రేవంత్ రెడ్డికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అన్నదాతల అవస్థల మీద లేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతలకు కన్నీళ్లు పెట్టిస్తున్నదని అన్నారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే సకాలంలో కొనుగోళ్లు చేపట్టకపోవడం నిరాశలోకి నెడుతున్నారని మండిపడ్డారు. సిద్దిపేట మార్కెట్ యార్డులో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని సోమవారం నాడు హరీశ్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను పరామర్శించిన అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
సరైన కరెంటు ఇవ్వక నీళ్లు ఇవ్వక పంటలు ఎండ కొట్టిందని.. రైతులను అన్ని రకాలుగా తిప్పలు పెడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రభుత్వం రైతులకు రైతుబంధు ఇవ్వలేదు.. నాణ్యమైన కరెంటు ఇవ్వలేదు.. నీళ్లు ఇవ్వలేదు.. పండిన పంటను కూడా కొనడం లేదు అని విమర్శించారు. రుణమాఫీ జరిగిన రైతులు వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం రుణమాఫీ కాని వారి వివరాలతో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. 25 శాతం మందికి రుణమాఫీ చేసి పూర్తి రుణమాఫీ జరిగిందని ప్రచారం చేసుకోవడం దుర్మార్గమని అన్నారు.
మరికొన్ని చోట్ల దొంగల బెడద కూడా రైతన్నకు నిద్ర లేకుండా చేస్తున్నదని హరీశ్‌రావు అన్నారు. ఇంటిని వదిలి, రోజుల తరబడి రైతులు వరి కుప్పలపై టార్ఫాలిన్ కవర్లు కప్పి అక్కడే కాపలా కాస్తున్న పరిస్థితి ఉందని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతలకు కన్నీళ్లు పెట్టిస్తున్నదని అన్నారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే సకాలంలో కొనుగోళ్లు చేపట్టకపోవడం నిరాశలోకి నెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అన్నదాతల అవస్థ మీద రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు. జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా మామిడి రైతులు నష్టపోయారని తెలిపారు. పత్తి రైతులకు ప్రభుత్వం మోసం చేసింని అన్నారు. CCI అధికారులతో కలిసి పత్తి రైతులను ముంచి 3500 కోట్ల కుంభకోణం చేశారని ఆరోపించారు. బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నించిన తర్వాత విజిలెన్స్ ఎంక్వయిరీ వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం సహా, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నా పాలకుల్లో మాత్రం ఎలాంటి చలనం లేదని మండిపడ్డారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని హరీశ్‌రావు మండిపడ్డారు. కాంటాలు పెట్టి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని వేడుకుంటున్నా కనికరం లేదని అన్నారు. సాగు నీళ్లు రాక వరి పొలాలు ఎండిపోయి ఉన్న కాస్త నీళ్లతో పంటను కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డా.. రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద కూడా కన్నీటి బాధలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బోనస్ ఇస్తామని ప్రకటించారు తప్ప ఆచరణ లేదని అన్నారు. బోనస్ పెద్ద బోగస్ అయ్యిందని విమర్శించారు. ఈ సీజన్ ఇప్పటి వరకు 25లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఇందులో 10.32 లక్షల టన్నుల సన్నాలు, 14.11 లక్షల టన్నుల దొడ్డు వడ్లు ఉన్నాయని తెలిపారు. దీని విలువ 515.82 కోట్లు కాగా, ఇప్పటి వరకు చెల్లించింది సున్నా అన్నారు. అంటే బోనస్ ను సున్నా చేశారని ఎద్దేవా చేశారు. భారం తగ్గించుకునేందుకు సన్నాలను కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. 30లక్షల టన్నుల సన్న ధాన్యం వస్తుందని అంచనా వేశారని అన్నారు.
కొర్రీలు పెడుతూ బోనస్ భారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. సర్కారు, మిల్లర్లు కలిసి డబుల్ గేమ్ ఆడుతున్నారని పేర్కొన్నారు. రైతులను నిండా ముంచుతున్నారని అన్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం జరిగిందని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి గొప్పగా చెప్పారని.. 48 గంటల్లో ధాన్యం కొనుగోలు డబ్బులు వేస్తున్నామని అన్నారని.. ఏ ఊర్లో కూడా పది రోజులు లోపు అమ్మిన పంటకు సంబంధించిన డబ్బులు రావడం లేదని చెప్పారు. ఫిబ్రవరిలో కట్టాల్సిన రైతు భీమా ఇప్పటివరకు కట్టకపోవడం వల్ల ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో చనిపోయిన రైతులకు రైతు బీమా రాలేదని తెలిపారు. వెంటనే రైతు బీమా డబ్బులు ప్రభుత్వం చెల్లించాలని, చనిపోయిన రైతు కుటుంబాలకు రైతు బీమా డబ్బులను అందించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో వెంటనే పంట నష్టం అంచనా వేయాలని సూచించారు. నష్ట పోయిన రైతులకు పంట నష్టం చెల్లించాలని.. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని.. ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. కొన్న పంట డబ్బులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని.. పెండింగ్ లో ఉన్న 500 కోట్లకు పైగా పంట బోనస్ ను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
cm revanth reddy does not have