Local Body Elections | రాయపోల్, జూన్ 18 : ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలను జరుపుకోవాలని తొగుట సీఐ షేక్ లతీఫ్ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని అనాజిపూర్ గ్రామంలో పర్యటించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో ఎటువంటి గొడవలు జరగకుండా అందరూ ప్రజాస్వామ్య బద్ధంగా సజావుగా ఎన్నికలు నిర్వహించే విధంగా ప్రజలు సహకారం అందించాలని పేర్కొన్నారు.
ప్రతీ ఒక్కరు ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. అంతేకాకుండా సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు చెప్పరాదని.. తెలియని లింకులు క్లిక్ చేయవద్దని.. డిజిటల్ అరెస్టులను నమ్మరాదని గుర్తు చేశారు.
రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నందున ప్రజలందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. ద్విచక్ర వాహనాదారులు కచ్చితంగా హెల్మెట్లు ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గంజాయి, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని.. గ్రామాల అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా సీఐ షేక్ లతీఫ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ ఎస్సై విక్కుర్తి రఘుపతి, ఏఎస్ఐ రాజు పోలీసులు, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
Chiranjeevi | డ్రిల్ మాస్టర్ శివశంకర్‌గా చిరంజీవి.. కామెడీకి పొట్ట చెక్కలవ్వాల్సిందే..!
Jogulamba Gadwal | గద్వాలలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్