రాయపోల్,జూన్ 26 : మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాల పై యువత, విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలని తొగుట సీఐ లతీఫ్ అన్నారు. గురువారం రాయపోల్ మండల కేంద్రంలో హైస్కూల్ నుంచి గ్రామ చావిడి వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిఐ లతీఫ్ మాట్లాడుతూ.. కళాశాలల్లో విద్యార్థులు, యువత డ్రగ్స్ బారిన పడకుండా డ్రగ్స్ వలన కలిగే దుష్ప్రభావాలను వారికి అవగాహన కలిగించాలన్నారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా డ్రగ్స్‌ను అరికట్టేందుకు పోలీసులకు సహకారం అందించాలన్నారు. విద్యార్థులు, యువత మాదకద్రవ్యాల బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం, రవాణా పై ఎటువంటి సమాచారం తెలిసినా డయల్ 100, 1908 ఫ్రీ నంబర్ కు సమాచారం అందించాలని కోరారు. ఈ ర్యాలీలో స్థానిక ఎస్సై రఘుపతి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు పాల్గొన్నారు.