ACP Purushottam Reddy | రాయపోల్ మండల కేంద్రంలో ఉన్న కస్తూర్భా బాలికల పాఠశాలలో ఆట వస్తువులు లేవని రాయపోల్ ఎస్ఐకి పాఠశాల ప్రిన్సిపల్ తెలియజేయగా ఎస్ఐ రఘుపతి వెంటనే తన స్నేహితురాలైన సీహెచ్ ప్రశాంతి రెడ్డి (సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికా) విషయం తెలియజేశారు. ఈ మేరకు ఆమె వెంటనే స్పందించి రూ.10 వేలు విలువగల ఆట వస్తువులు పంపించారు. వీటిని ఇవాళ గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి విద్యార్థులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏసీపీ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ.. ఆట వస్తువులు పంపించిన ప్రశాంతి రెడ్డిని అభినందించారు. అదేవిధంగా పిల్లలు చదువుతోపాటు ఆటల్లో పాల్గొంటూ మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని సూచించారు. చదువుకు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వాలని తెలిపారు. పిల్లలకు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే డయల్ 100కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
మహిళల రక్షణకు మహిళలు, పిల్లల రక్షణకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి.. సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మంచిగా చదువుకొని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. పిల్లలపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారని.. మీరు శ్రద్ధగా చదివి మంచి స్థానాల్లో ఉంటే తల్లిదండ్రులకు అంతకు మించిన సంపద ఆనందం మరేది ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సుగంధ, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.
Passengers | 40 గంటలుగా తుర్కియే ఎయిర్‌పోర్ట్‌లోనే.. వసతుల లేమితో భారతీయ ప్రయాణికుల అవస్థలు
Alampur | అలంపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గవ్వల శ్రీనివాసులు
Taj Mahal: టికెట్ సేల్స్ ద్వారా ఆదాయం.. టాప్‌లో తాజ్‌మహల్