Cheruvu Gandi | తొగుట, ఆగస్టు 30 : తొగుట మండలంలోని జప్తి లింగారెడ్డి పల్లి గ్రామానికి సంబంధించిన తుంగ చెరువు కట్ట అకాల వర్షానికి తెగిపోవడం జరిగిందని, తెలియగానే అక్కడికి వచ్చి మరమ్మతులు చేయించిన సీఐ లతీఫ్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎస్ఐ రవి కాంతారావు, ఇరిగేషన్ ఏఈ ఆస్మాలకు మాజీ సర్పంచ్ చిలివేరి రాంరెడ్డి ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించడం జరిగిందని అన్నారు.
సమాచారం అందించగానే హుటాహుటిన మరమ్మతులు చేయించి, ఎలాంటి ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐ లతీఫ్ మాట్లాడుతూ.. రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో కలిసి సమాచారం అందిన వెంటనే దాదాపు 5,6 గంటల్లోనే కట్టకు ఏర్పడిన గండిని పూడ్చడం జరిగిందన్నారు. తొగుట చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో అధికంగా వర్షపాతం నమోదైందని తెలిపారు.
తొగుట మండలంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైన వెంటనే తమకు సమాచారాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవికాంత్ రావు, ఏఎస్ఐ రాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శి వేలాద్రి, నాయకులు ఎన్నో భూపాల్ రెడ్డి కొండల్ రెడ్డి. రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Harish Rao | పెట్రోల్‌కు రేవంత్ డబ్బులు ఇస్తున్నాడా..? పోలీసులకు హరీశ్‌రావు సూటి ప్రశ్న
పార్టీ మారితేనే సహకారం.. లేదంటే తిరస్కారం..