Arjun Sarja | మల్టీ టాలెంటెడ్ యాక్టర్, యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun) డైరెక్షన్లోవచ్చిన చిత్రం సీతా పయనం (Seetha Payanam). కన్నడ యాక్టర్ నిరంజన్ సుధీంద్ర, అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వాలైంటెన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. మంచి స్పందన రాబట్టుకుంటున్న ఈ మూవీ ప్రత్యేకించి తండ్రీ కూతుళ్లకు బాగా కనెక్ట్ అవుతుందని టాక్ చెబుతోంది. కాగా సక్సెస్ ఈవెంట్లో అర్జున్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆర్థికంగా నాకు సీతా పయనం సినిమా ఎలా హెల్ప్ అవుతుందనే మాట పక్కన పెడితే.. సినిమా అవుట్‌పుట్ పట్ల నాకు సంతోషంగా ఉంది. నా కర్తవ్యం నేను చేశాననే తృప్తి ఉంది. చూసిన వాళ్లంతా బాగా విష్ చేస్తున్నారన్నాడు అర్జున్. నేను నా కూతురిని పరిచయం చేయాలని ఈ సినిమా చేశాను. మీ కూతురు ఎంత బాగా నటించిందని అంతా పొగుతున్నారు.. అని చెప్పినప్పుడు నేను పాసైపోయాన ఫిక్సయ్యా . ఈ సినిమా చూసిన కొంతమందికి వాళ్ల ఫీలింగ్‌ను ఎలా చెప్పాలో తెలియడం లేదు. చాలా మంది ఫాదర్స్ ఇది నా కథ అనుకుంటుంటే.. కూతుళ్లేమో ఇది నా కథ అనుకుంటున్నారని చెప్పాడు అర్జున్.
ఎవరైనా వచ్చి నేను హిట్టు ఇచ్చానంటే నాకు అనిపిస్తుంది. ఎవరైనా డైరెక్టరైనా, యాక్టరైనా సరే వచ్చి నేను హిట్టు ఇచ్చానంటే నాకు అలానే చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఎంతోమంది డైలాగ్ రైటర్స్, యాక్టర్లు, మ్యూజిషియన్లుంటారు. మేము సినిమా కోసం అంతా రెడీగా పెట్టుకుంటాం. కానీ ఒక్క వర్కర్ లేకున్నా సినిమా ఆగిపోతుందన్నాడు అర్జున్.
నన్ను జెంటిల్ మెన్ సినిమా చేయాలని అడిగారు. ఇండస్ట్రీ మీద కోపంతో నాకు ఎవరూ హెల్ప్ చేయలేదు.. నేనెందుకు చేయాలన్నా. వద్దు నేను ఒంటరిగా సంతోషంగా ఉన్నానని చెప్పా. ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ (కొత్త వ్యక్తి) ఒకసారి కథ వినండి.. వద్దనిపిస్తే మీరు చేయొద్దు అన్నాడు. సరే కథ విని వద్దని చెప్తానని.. కథ వింటే.. ఇంత సూపర్ గా కథ.. దీన్ని ఎలా వద్దని చెప్పేది.. వద్దంటే ఎవరైనా కొడతారని చెప్పి ఆ సినిమా ఒప్పుకున్నా.. ఆ సినిమా సూపర్ డూప్ హిట్టయిపోయింది. చూస్తుండగానే స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా ఇచ్చేశారు. నేను ఎక్కడ పోలీస్ అవ్వాలనుకున్నా.. ఇలా బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చేసింది.. అప్పటి నుంచి నా బాధ్యత పెరిగిందని చెప్పుకొచ్చాడు అర్జున్.
Jacqueline Fernandez | జాక్వెలిన్‌కు రూ.30 కోట్ల హెలికాప్టర్ గిఫ్ట్ ఇచ్చిన సుఖేశ్!