Drunk And Drive | గజ్వేల్, నవంబర్ 13 : మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాలు పోతున్నాయని, కుటుంబాలు దెబ్బతింటున్నాయని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి హెచ్చరించారు. గజ్వేల్ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 25 మంది వాహనదారులను గుర్తించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మురళి మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా విధిస్తాం. రెండోసారి దొరికితే రూ.15 వేలు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించబడుతుంది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆరు నెలలపాటు సస్పెండ్ చేస్తాం అని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వలన జరిగే ప్రమాదాలు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన అన్నారు. ‘మీ భార్య, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా డ్రైవ్ చేయండి’ అని సూచించారు.
అలాగే మైనర్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సైలెన్సర్ మార్పులు, తారుమారు నెంబర్ ప్లేట్లు వంటి ఉల్లంఘనలపై ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏఎస్ఐ జగదీశ్వర్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
Ambati Rambabu | వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు
Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల సమయం
Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాదం.. వెలుగులోకి కొత్త వీడియో