Bus Accident | రాయపోల్,అక్టోబర్ 27 : బస్సు, కారు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన మండల కేంద్రం రాయపోల్ హై స్కూల్ దుర్గమ్మ గుడి మూలమలుపు వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం బొమ్మదేవన్ పల్లి గ్రామానికి చెందిన భరద్వాజ్ శంకర్రావు ఆర్ెఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నారు.
భరద్వాజ్ శంకర్రావు భార్య స్వప్నతోపాటు అనంతరావు కలిసి TS 11 EV 1623 EON హుండాయ్ కారులో గజ్వేల్ నుండి రామాయంపేట వైపు వస్తుండగా గజ్వేల్- ప్రజ్ఞాపూర్ డిపో కు చెందిన TG 36 Z 0027 గల ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా వచ్చి మండల కేంద్రం రాయపోల్ హై స్కూల్ దుర్గమ్మ గుడి వద్ద ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన పోలీసులు, స్థానికులు అక్కడికి చేరుకొని బాధితులను చికిత్స నిమిత్తం వెంటనే 108 వాహనం ద్వారా గజ్వేల్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
