Land dispute | కొమురవెల్లి, జూలై 17 : భూతగాదాలతో కొమురవెల్లి మండల కేంద్రంలో గురువారం ఫ్యాక్షన్ సినిమాను తలపించేలా దాడి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఐనాపూర్‌కు చెందిన అలేటి రాంరెడ్డి అదే గ్రామానికి చెందిన నాయిని ప్రతాప్‌రెడ్డిల మధ్య కొంతకాలంగా భూతగాదాలు ఉన్నాయి.
కాగా గురువారం అలేటి రాంరెడ్డి కొమురవెల్లిలో వైన్స్ పక్కనే ఉన్న ఫర్మిట్రూమ్లో మద్యం సేవిస్తున్న సమయంలో ప్రతాప్‌రెడ్డి తన అనుచర వర్గంతో దాడి చేశాడు. దీంతో రాంరెడ్డి భయంతో పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో తన బైక్‌పై పరుగులు తీయగా ప్రత్యర్థులు ప్యాక్షన్ సినిమాను తలపించేలా కారుతో అతడిని వెంబడించి పోలీస్ స్టేషన్ సాక్షిగా అతడిని కారుతో ఢీకొట్టారు. దీంతో రాంరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి.
కాగా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే వ్యక్తిని కారుతో ఢీకొడితే ఇంకా ఇలాంటి సంఘటనలు బయట పరిస్థితి ఎలా ఉంటుందో..? అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరవృత్తం కాకుండా పోలీసులు పకడ్భంది చర్యలు తీసుకోవాని స్థానికులు కోరుతున్నారు.
Siddipeta | రైతుల గోస రేవంత్ రెడ్డికి వినబడట్లేదా..? : జీడిపల్లి రాంరెడ్డి
Oil Palm | ఆయిల్ పామ్ తోటల సాగుతో అధిక లాభాలు..
Medak | కల్లు.. కల్లు.. కల్లమ్మ కల్లు.. కొత్త పుంతలు తొక్కుతున్న కల్తీకల్లు వ్యాపారం