BRS MLAs | రాయపోల్, సెప్టెంబర్ 09 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం అత్యంత దారుణమని బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు రాజిరెడ్డి తీవ్రంగా ఖండించారు.
బుధవారం సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ప్రశ్నించే గొంతుకులను నొక్కడమే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశమని.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం, వారిని సభ నుంచి సస్పెండ్ చేయడం ద్వారా ప్రజల గొంతును అణచివేయాలని చూస్తోందని ఆరోపించారు.
అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలపై చర్చించే పవిత్రమైన వేదిక అని, అక్కడ ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.
ప్రశ్నించే గొంతులను సస్పెండ్ చేసినంత మాత్రాన ప్రజా సమస్యలు కనుమరుగు కావని, ప్రజల సమస్యలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని రాజిరెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేసి, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చకు ప్రభుత్వం అవకాశం కల్పించాలని రాజిరెడ్డి కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రశ్నించడం సహజమని, ప్రశ్నించే ప్రతిపక్ష గొంతును అణచివేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఇక నుండి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలనునెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు.
Asian Games | జపాన్‌లో భారీ వరదలు.. ఆసియా గేమ్స్‌కు ముప్పు.. అథ్లెట్స్ తరలింపు
AP News | రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామం లాంటివి : వైఎస్ జగన్
భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేయాలి : జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి