కీవ్: ఉక్రెయిన్‌పై దాడిని వ్యూహాత్మకంగా కొనసాగిస్తోంది రష్యా. కీలకమైన బ్రిడ్జ్‌ల(Kyiv Bridge)ను తాజాగా టార్గెట్ చేసింది. కీవ్ పట్టణంలో ఉన్న రెండో బ్రిడ్జ్‌పై ఇవాళ రష్యా దాడి చేసినట్లు మేయర్ విటాలీ క్లిచ్కో తెలిపారు. ఉక్రెయిన్ రాజధానిలో ఉన్న కీలక ప్రదేశాలను రష్యా టార్గెట్ చేస్తున్నది. నార్తర్న్ బ్రిడ్జ్‌పై ఉన్న ఓవర్‌హెడ్ వైర్లు, రోడ్డు, ట్రాలీ బస్సు ధ్వంసమైనట్లు క్లిచ్కో వెల్లడించారు. ఇటీవల వరుసగా డ్రోన్లతో రష్యా తన దాడిని కొనసాగిస్తున్నది. గురువారం సదరన్ బ్రిడ్జ్‌పై అటాక్ చేసిన విషయం తెలిసిందే. రష్యా చేస్తున్న తాజా దాడులతో కీవ్ నగరం ముక్కలవుతోందని క్లిచ్కో చెప్పారు. కీవ్ సిటీలో తూర్పు, పశ్చిమ ప్రాంతాలను కలిపే రెండు కీలక బ్రిడ్జ్‌లను ఇప్పటికే రష్యా డ్రోన్లతో టార్గెట్ చేయడం గమనార్హం.