Shivon Zilis : టెస్లా సీఈఓ (Tesla CEO) ఎలాన్‌మస్క్ (Elon Musk) వ్యక్తిగత బంధం మరోసారి వార్తల్లో నిలిచింది. తన ప్రస్తుత భాగస్వామి శివోన్ జిలిస్ (Shivon Zilis) నుంచి ఆయన విడిపోయారు. ఎలాంటి కారణం చెప్పకుండా, బ్రే కప్ గురించి ముందుగా ఎలాంటి చర్చలేకుండా మస్క ఆమెతో బంధాన్ని తెంచుకున్నాడు. ఈ విషయాన్ని శివోన్ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా (Social Media) లో ఓ భావోద్వేగ పోస్టు పెట్టారు. ఈ పోస్టు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ముందుగా ఎలాంటి చర్చలేకుండా వారంరోజల్లోనే ప్రేమలో నుంచి బయటకు వచ్చేయడం చాలా కష్టమని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. కానీ కొన్ని పరిస్థితులు ఇలాగే ఉంటాయని, తనకు ఎంతో బాధగా ఉందని తెలిపారు. E (ఎలాన్ మస్క్‌ను ఉద్దేశిస్తూ) అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన ఎన్నో జన్మలకు సరిపడా జ్ఞానాన్ని నేర్పించి, తన జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చారని వెల్లడించారు. ఎలాన్ సంతోషాన్ని తాను ఎల్లప్పుడూ కోరుకుంటానని పేర్కొన్నారు. ఈ ప్రపంచానికి ఆయన (Elon Musk) ఒక వరమని చెప్పారు.
బయట ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొన్నా.. ఇంట్లో ఆయన ప్రశాంతంగా ఉండేలా తాను, తన పిల్లలు చూసుకున్నామని శివోన్ పేర్కొన్నారు. మస్క్‌తో బంధం నుంచి దూరం కావడం తనకు లోటేనని ఆవేదన వెలిబుచ్చారు. తాము మంచి స్నేహితులుగా ఉండి, పిల్లలకు తోడుగా ఉంటామని ఆశిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తంచేశారు. కాగా శివోన్ జిలిస్ యేల్ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు. ఓపెన్ఏఐలో పనిచేసిన సమయంలో మస్క్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది.
అప్పటి నుంచి వారు సహజీవనం చేస్తున్నారు. 2017లో మస్క్ ఆధ్వర్యంలోని న్యూరాలింక్ ప్రాజెక్టులో ఆమె చేరారు. ఆ ప్రాజెక్టు కింద మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చే ప్రయోగాలు చేస్తున్నారు. ఆ సంస్థలో ఆమెది డైరెక్టర్ హోదా. కెనడాలో పెరిగిన శివోన్‌కు భారతీయ మూలాలున్నాయి. ఆమె తల్లి పంజాబీ. మస్క్-శివోన్‌కు నలుగురు సంతానం. 2021 నవంబర్‌లో ఐవీఎఫ్ ద్వారా ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చారు. తర్వాత మరో ఇద్దరు పిల్లలు జన్మించారు.
వారిలో ఒక కుమారుడి పేరులో శేఖర్ పదం ఉంటుంది. భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ గౌరవార్థం ఈ పేరు పెట్టినట్లు గతంలో ఓ సందర్భంలో మస్క్ చెప్పారు.