KCR | ఎర్రవెల్లిలోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి, శాసనసభా పక్షాల ఉప నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం, పార్టీ ఇంచార్జీల నియామకం, పార్టీ బలోపేతం సహా తదితర ముఖ్య విషయాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్,
కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ ఎస్ మధుసూదనాచారి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు తక్కల్లపల్లి రవీందర్ రావు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ డా. బండా ప్రకాష్ ముదిరాజ్, మాజీ ఎమ్మెల్సీ వి. గంగాధర్ గౌడ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ , మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, రిటైర్డ్ ఐపీఎస్ ఆర్. శ్రవణ్ కుమార్ రెడ్డి, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డి , మాజీ చైర్మన్ సోమా భరత్ కుమార్ గుప్తా , మాజీ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి , మాజీ మంత్రి మహమ్మద్ అలీ , మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.
కేసీఆర్ అధ్యక్ష్యతన ఎర్రవెల్లి నివాసంలో మొదలైన సమావేశం
హాజరైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీవన్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర కీలక నాయకులు
పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం… https://t.co/mWjiYOfeYG pic.twitter.com/rwMlGMRi5R
— Telugu Scribe (@TeluguScribe) May 12, 2026
బండి భగీరథ్‌పై పోలీసులు కావాలనే చిన్న సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు : అడ్వకేట్ లలితా రెడ్డి
KTR | విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం.. నీట్ రద్దుపై కేటీఆర్