కోల్‌కతా: ప్రవాస బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ 19 ఏండ్ల తర్వాత శుక్రవారం కోల్‌కతాకు తిరిగి వచ్చారు. తన వివాదాస్పద ఆత్మకథ డ్విఖోండిటోను 2003లో ప్రచురించిన తర్వాత దానిపై నిరసనలు వెల్లువెత్తడంతో 2007లో ఆమె బలవంతంగా కోల్‌కతాను వీడి ఢిల్లీలో ఉంటున్నారు. శుక్రవారం ఆమె కోల్‌కతా విమానాశ్రయంలో దిగగానే తిరిగి అక్కడకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు.
శనివారం రవీంద్ర సదన్‌లో ఛాందస వాదానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమానికి నస్రీన్ హాజరు కానున్నారు. బంగ్లాదేశ్ నుంచి 1990 దశకంలో పారిపోయి వచ్చాక ఆమె కోల్‌కతాలో స్థిరపడ్డారు. అయితే ఆమె ఆత్మకథ మతపరమైన నమ్మకాలను గాయపరిచేలా ఉందని ఆరోపణలు రావడంతో 2003లో నాటి సీపీఎం నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆ పుస్తకాన్ని నిషేధించింది.