న్యూఢిల్లీ : పీఎం కిసాన్ పథకాన్ని కేంద్రం మరో ఐదేండ్లు పొడిగించింది. రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించే ఈ పథకానికి రూ.3.15 లక్షల కోట్లు కేటాయిస్తూ.. కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. 2019లో ప్రారంభించిన ఈ పథకం కింద ప్రతి రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఆర్థిక సహాయం అందజేస్తారు.
క్యాబినెట్ నిర్ణయాలను మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు. కాగా, సముద్ర మంథన్ ఆఫ్షోర్ అన్వేషణ పథకానికి రూ.84,084 కోట్లను కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లోతైన సముద్ర ప్రాంతాల్లో చమురు, గ్యాస్ నిల్వలను కనుగొనడానికి ఈ పథకం ఉద్దేశించింది. చమురు బావుల తవ్వకం, నిల్వలను ఉత్పత్తిలోకి తీసుకురావడానికి ఈ నిధులను వెచ్చిస్తారు.