వర్గల్, మే4: వర్గల్ మండలం నెంటూర్ గ్రామానికి చెందిన తిమ్మపురం భూమయ్యగౌడ్ అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓప్రైవేట్ దవాఖానలో చేరగా, ఇందుకుగానూ చికిత్సకోసం పెద్దమొత్తంలో డబ్బులు ఖర్చు అయ్యాయి. పేదకుటుంబం కావడంతో స్థానిక బీఆర్ఎస్ నాయకుల సూచనతో సీఎంఆర్ఎఫ్ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారు.
ఆదివారం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.33000 ల చెక్కును మాజీ ఎంపీటీసీ శ్యామల, మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ గ్రామకమిటీ అధ్యక్షుడు కిచ్చుగారి కనకనరాజు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాఘవరెడ్డి, లింగకిష్టయ్య భూమయ్యగౌడ్ కుటుంబ సభ్యులకు అందజేశారు.