BRS Party | రాయపోల్, ఏప్రిల్ 12 : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఏర్పాటు చేసిన పార్టీ రజతోత్సవ సభను జయప్రదం చేయడానికి గ్రామ గ్రామాన ప్రజలు, యువకులు, మహిళలు, తెలంగాణ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, దౌల్తాబాద్ మండల మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సరువు గారి యాదవ రెడ్డి పిలుపునిచ్చారు.
ఇవాళ ఆయన హైమద్ నగర్లో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ నేత స్వరాష్ట్ర సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన వరంగల్ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరోసారి చాటి చెప్పాల్సిన అవసరం వచ్చిందన్నారు. నీళ్లు, నిధులు నియామకాలపై కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ బడుగు, బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో పెద్ద పీట వేసి వారి అభివృద్ధి, సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆచరణకు మించి వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు.
కరెంటు కోతలు, ఎండిపోతున్న పంటలు..
ఎన్నికలకు ముందు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, యువతకు ఉపాధి, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రైతు సంక్షేమాలకు పెద్దపీట వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చిందని.. దీంతో ఆ పార్టీ ప్రజల్లో రోజురోజుకు ఆదరణ కోల్పోతుందని పేర్కొన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా రైతాంగానికి సాగునీరు అందించే మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్మించినప్పటికీ వాటిని వినియోగంలోకి తీసుకురావాలసిన ప్రభుత్వం హైదరాబాద్‌కు నీటిని తరలిస్తామని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఇక్కడి ప్రాంత రైతులు యాసంగిలో వరి సాగు చేసి వాటిని కాపాడుకోవడానికి సాగునీరు లేక నానా తంటాలు పడుతున్నారని.. పక్కనే మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టు ఉన్నప్పటికీ తమకు నీరు రావడంలేదని ఆయా మండలాల్లోని రైతులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 27న నిర్వహించబోయే రజతోత్సవ సభకు గ్రామ గ్రామాన ఛలో వరంగల్ తరలివెల్లి తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో గత 10 సంవత్సరాల్లో తెలంగాణ సస్యశ్యామలం చెందిందని.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు కోతలు, ఎండిపోతున్న పంటలు, మంచి నీటి కొరత, అనేక సమస్యలు ఉన్నప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ టూర్ తప్ప రైతులకు ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు.
Ramakrishna Math | రామకృష్ణ మఠంలో వేసవి శిక్షణా శిబిరాలు
padi koushik reddy | బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
Mutton | మటన్‌ను ఎంత మోతాదులో తింటే మంచిది..? ఈ లిమిట్ దాటితే కష్టమే..!