Paddy Grain | తొగుట, ఏప్రిల్ 12: ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా వరి ధాన్యంలో తేడా లేకుండా దొడ్డు వడ్లకు సైతం రూ. 500 బోనస్ ఇవ్వాలని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించి, నేడు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సన్న ధాన్యంకు మాత్రమే బోనస్ ఇవ్వడం అంటే రైతులను మోసం చేయడమే అవుతుందన్నారు.
10 లక్షల మందికి పైగా రుణమాఫీ కాని వారు ఉన్నారని, ప్రభుత్వం మాత్రం రుణమాఫీ పూర్తయిందని చెప్పడం సిగ్గుచేటన్నారు. పంట సాగు చేసే సమయంలో ఇవ్వాల్సిన రైతు భరోసా పంట పూర్తి కావొస్తున్నా వేయడం లేదని, ఇప్పటికే ఒక విడత రైతు బందు ఎగొట్టారని విమర్శించారు..
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు దండుగ అన్న కాంగ్రెస్ నాయకులు నేడు కరువు కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణాధారంగా పనిచేస్తున్న విషయం మరిచిపోవద్దన్నారు.
అధికారంలోకి వొస్తే పూర్తి చేసేవాళ్లం..
కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలా ప్రాజెక్టులు, ప్రధాన కాలువలు పూర్తి చేసినా, వాటిలోకి నీళ్లు విడువడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కేసీఆర్ హయాంలోనే మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులతోపాటు ప్రధాన కాలువలు పూర్తి చేయడం జరిగిందని, ఈ సారి అధికారంలోకి వొస్తే పూర్తి చేసే వారమన్నారు.
ఎమ్మెల్యేగా గెలువగానే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గంలోని చిన్న కాలువలు పూర్తి చేసి.. చెరువు కుంటలు నింపి సస్యశ్యామలం చేయాలని కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని.. అదేవిధంగా అసెంబ్లీలో ప్రస్థావించడం జరిగిందన్నారు. మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు.
6 గ్యారంటీలు, 420 హామీలలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. అబద్దాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెల్లదీస్తుందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య పేర్కొన్నారు. సన్న బియ్యంలో నూకలే ఎక్కువ ఉంటున్నాయని ఆయన విమర్శించారు. సాగునీటి కాలువలు పూర్తి చేసి పంట పొలాలకు సాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ఆయన ప్రశ్నించారు.
దేవుళ్ల మీద ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయకుండా దేవుళ్లను కూడా మోసం చేశాడని ఆయన విమర్శించారు. కేసీఆర్ చలవతో నేడు పుష్కలంగా వరి ధాన్యం పండుతుందని, రూ. 500 బోనస్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కె హరికృష్ణారెడ్డి, నాయకులు చిలువేరి మల్లారెడ్డి, శ్రీధర్, పాత్కుల బాలేష్, జహంగీర్, కమలాకర్, సుతారి రాంబాబు తదితరులు ఉన్నారు.
Rollavagu project | రోళ్లవాగు ప్రాజెక్ట్ కు గేట్లు బిగించక వృథాగా పోతున్న నీరు
IPL 2025 | సెంచరీ హీరో అభిషేక్ శర్మకు వెల్లువెత్తిన అభినందనలు.. గురువు యువరాజ్ ఏమన్నాడంటే..?
Pawan Kalyan | హైదరాబాద్కి వచ్చాక తొలిసారి కొడుకు ఆరోగ్యంపై స్పందించిన పవన్ కళ్యాణ్