Harish Rao | అకాల వడగండ్ల వానలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.. ఈసిద్దిపేట నియోజకవర్గంలో బుధవారం రాత్రి కురిసిన వడగండ్ల వాన అన్నదాతలకు తీవ్ర నష్టం చేసిందని, రైతుల అరుగాళ్ల కష్టం నేల పాలయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలో వరి, మొక్కజొన్న, మామిడి పంటలపై అకాల వర్షం తీవ్ర నష్టం చేసిందన్నారు.. నష్ట పోయిన పంటలకు 20 వేల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులతో హరీశ్‌రావు ఫోన్లో మాట్లాడారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి, పంట నష్టం అంచనా వేసి, నష్టపోయిన రైతుల జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని సూచించారు. ఆందోళనలో ఉన్న అన్నదాతలను అదుకోవాలని చెప్పారు. రైతులు ధైర్యంగా ఉండాలని అధైర్య పడొద్దని, ఆందోళన చెందొద్దని అన్నారు.