మిరుదొడ్డి, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : సిద్ధిపేట జిల్లాలోని మండల కేంద్రమైన మిరుదొడ్డి (Mirudoddi)లో ఆదివారం ‘బొడ్రాయి వార్షికోత్సవం’ ఆద్యంతం కన్నులపండుగా జరిగింది. ఈ ఉత్సవాలను గ్రామానికి చెందిన అన్ని కులాల వారు సమూహికంగా వైభవంగా నిర్వహించారు.
బొడ్రాయి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలు ప్రతి ఇంటి నుంచి మాణిక్యాలను తీసుకొచ్చారు. ఆ మాణిక్యాలను బొడ్రాయి అమ్మవారికి సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం మహిళలు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో సంబురంగా పాల్గొన్నారు.