మంచిర్యాల : జిల్లాలోని కాసిపేట మండలం సోమగూడెం(కే) గ్రామానికి చెందిన సపాట్ శంకర్ (Sapat Shankar) ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మంచిర్యాల జిల్లా ( Mancherial District ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ సబావత్ రాములు నాయక్ ( Ramulu Naik ) చేతుల మీదుగా నియామకపత్రాన్ని అందుకున్నారు.
తనకు జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా నియమించినందుకు సపాట్ శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. బంజారాల అభివృద్ధి కోసం అను నిత్యం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం మాజీ అధ్యక్షులు శ్యాం నాయక్, మంచిర్యాల జిల్లా తండా పూజారి బానోత్ సకలాల్ నాయక్, బోడ బలరాం నాయక్, డి సదానందం నాయక్, బాలు నాయక్, కుమార్ నాయక్, నందు నాయక్, లాలు నాయక్, తిరుపతి నాయక్, లక్ష్మణ్ నాయక్, చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.