సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేయాలి
సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో నర్మెటలోని ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డి, సిద్దిపేట కలెక్టర్ హైమావతి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన సందర్శించారు.
- 22న సీఎం రేవంత్‌రెడ్డి చేత ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం
- రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నంగునూరు, మార్చి 14: సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో నర్మెటలోని ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డి, సిద్దిపేట కలెక్టర్ హైమావతి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన సందర్శించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 22న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తామన్నారు. ఫ్యాక్టరీ ప్రారంభానికి రాష్ట్ర నలుమూలల నుంచి రైతులు వస్తారన్నారు. మూడు రోజుల పాటు రైతుమేళా నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ నుంచి ఆయిల్‌పామ్ పంట ఎకువగా వచ్చే అవకాశం ఉందని వివరించారు. సిద్దిపేట ప్రాంతం రాష్ట్రానికి కేంద్ర బిందువు కానుందన్నారు. రూ. 40 కోట్లతో రిఫైనరీ కోసం అదేరోజు శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. రైతులు కమర్షియల్ పంటలు పండించాలన్నారు.
వడ్లు కొనుగోలు చేయలేమని కేంద్రం చెబుతుందన్నారు. దేశంలో వరి సాగులో తెలంగాణ మొదటి స్థానంలో ఉంద న్నారు. రైతులు ఆయిల్‌పామ్ సాగు వైపు దృష్టిపెట్టాలని, ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందన్నారు. భవిష్యత్‌లో ఆయిల్‌పామ్‌కు మద్దతు ధర ఇవ్వాలని ప్రధానమంత్రి మోదీని కోరుతామన్నారు. ఆయిల్‌పామ్‌లో అంతర్ పంట సాగుచేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగవుతోందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రతి రైతు ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో నాయకుడు గిరి కొండల్‌రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

