Coco Gauff : ‘పెద్ద పెద్ద కలలు కనండి. ఆ కలలను సాకారం చేసుకునేందుకు శ్రమించండి’ అని పెద్దలు చెబుతుంటారు. ఆ మాటలు అక్షర సత్యమని నిరూపిస్తోంది అమెరికా టీనేజర్ కోకో గాఫ్(Coco Gauff). టీనేజ్ నుంచే వార్తల్లో నిలుస్తున్న తను రెండేళ్ల క్రితం యూఎస్ ఓపెన్(US Open) ట్రోఫీతో సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఏకంగా ఫ్రెంచ్ ఓపెన్ (French Open) టైటిల్‌తో తన కలను సాకారం చేసుకుందీ యువకెరటం. మ్యాచ్ అనంతరం ఈ యంగ్‌స్టర్ తన విజయ రహస్యాన్ని వెల్లడించింది. ఒలింపిక్ విజేతను స్ఫూర్తిగా తీసుకొని టైటిల్ గెలుపొందాను అని తెలిపిందీ నయా ఛాంపియన్.
మనం ఏదైనా సాధించాలంటే లక్ష్యాన్ని స్పష్టంగా చూడాలి. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో పాటు కచ్చితంగా నేను విజయం సాధిస్తాననే నమ్మకం కూడా ఉండాలి. అప్పుడే ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా అవతరించిన గాఫ్ కూడా ఇదే మంత్రను అనుసరించిందట. ‘ఫ్రెంచ్ ఓపెన్ ముందు నేను అమెరికా అథ్లెట్, ఒలింపిక్ విజేత గబ్బీ థామస్ (Gabby Thomas)ను స్ఫూర్తిగా తీసుకున్నాను. ప్యారిస్ విశ్వక్రీడల 200 మీటర్ల ఛాంపియన్ అయిన గబ్బీకి ఒక అలవాటు ఉండేది.
wow.
this means so much to me truly….french open champion🥹
i worked so hard for this moment and for it to have happened is insane. thank you God ❤️ and thank you everyone. this means the world…. I ‘m still in shock honestly can’t find the words but all I can say for now is… pic.twitter.com/5rAaTrhk16— Coco Gauff (@CocoGauff) June 7, 2025
తాను కచ్చితంగా ఒలింపిక్స్‌లో విజయం సాధిస్తానని ఆమె కాగితం మీద రాసుకుందట. ఇదే విషయాన్ని మెడల్ సాధించిన అనంతరం మీడియాతో చెప్పింది. నేను కూడా ఆవిడను అనసరిస్తూ.. ‘నేను 2025 ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్ అవుతాను’ అని ఒక బుక్‌లో రాసుకున్నా. అప్పట్నుంచి అద్దంలో నన్ను నేను చూసుకుంటూ విజయం నాదే అని పదే పదే అనుకునేదాన్ని. థామస్ పాటించిన సూత్రం నా విషయంలోనూ నిజమైంది. నేను నమ్మినట్టే ఈసారి మట్టికోర్టులో విజేతగా అవతరించాను’ అని ఒలింపిక్ విజేతను కాపీ కొట్టిన తీరును గాఫ్ పూసగుచ్చింది.
COCO GAUFF WINS HER SECOND CAREER MAJOR TITLE 🏆 pic.twitter.com/2szV4R5y1P
— ESPN (@espn) June 7, 2025
అమెరికా సంచనలం కొకొ గాఫ్ తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్‌గా అవతరించింది. కెరియర్లో రెండో గ్రాండ్‌స్లామ్ సొంతం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో నంబర్ 1 అరీనా సబలెంక(Aryna Sabalenka)పై అద్భుత విజయంతో టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఉత్కంఠ పోరులో పట్టువదలకుండా చెలరేగిన తను ప్రత్యర్థికి చెక్ పెట్టింది. తొలి సెట్ కోల్పోయినప్పటికీ తన మార్క్ ఆటతో విరుచుకుపడ్డ గాఫ్.. చివరి రెండు సెట్లు గెలుపొందిన తన కలను సాకారం చేసుకుంది.
టైటిల్ పోరులో అరీనా సబలెంక నుంచి ఆమెకు గట్టి పోటీ ఎదురైంది. పైగా తొలి సెట్‌ను 6-7తో కోల్పోయిందీ యంగ్‌స్టర్. అయినా సరే తను పట్టువిడవలేదు. అసమాన పోరాటపటిమను కనబరిచిన గాఫ్.. బెలారస్ భామకు ముచ్చెమటలు పట్టించింది. ఫోర్‌హ్యాండ్ షాట్లతో చెలరేగి రెండో సెట్‌ను 6-2తో అలవోకగా గెలుచుకున్న ఈ యవకెరటం.
The list is complete for @CocoGauff ✅ pic.twitter.com/0NNcAXRs4Q
— US Open Tennis (@usopen) June 7, 2025
మూడో సెట్లోనూ సబలెంకపై పైచేయి సాధించింది. బ్రేక్ పాయింట్లు సాధిస్తూ.. పదునైన షాట్లతో ఆమెను నిలువరించిన గాఫ్ 6-4తో గెలుపొంది తన ఫ్రెంచ్ ట్రోఫీ కలను నిజం చేసుకుంది. తద్వారా లెజెండ్ సెరెనీ విలియమ్స్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించిన అమెరికన్‌గా గాఫ్ రికార్డు నెలకొల్పింది.