Begumpeta | రాయపోల్, జులై 31 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని బేగంపేట జెడ్పీ హై స్కూల్కు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కార్తీక, హర్షవర్ధన్, చైతన్యలు, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు భాస్కర్ రెడ్డి మార్గదర్శనంలో రూపొందించిన వినూత్న ఆవిష్కరణ “స్మార్ట్ వాకింగ్ స్టిక్” ఏఐసీటీఈ స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ -2025లో జాతీయ స్థాయికి ఎంపిక కావడం గర్వకారణం.
ఈ సందర్భంగా విద్యార్థులు ఇటీవల న్యూఢిల్లీలో గల గల్గొటియాస్ యూనివర్సిటీలో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE) అసిస్టెంట్ డైరెక్టర్ అభయ్ జేర్, ఇన్నోవేషన్ డైరెక్టర్ ఎలెన్ గోవన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లోని ప్రతిభను, సృజనాత్మకతను దేశవ్యాప్తంగా గుర్తించినదానికి ఈ గౌరవమే నిదర్శనం. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంజి రెడ్డి, ఉపాధ్యాయులు, సీఆర్పీ యాదగిరి, స్వామి తల్లిదండ్రులు, విద్యార్థులను అభినందించారు.
MEO Gajjela Kanakaraju | విద్యార్థులకు జీవ వైవిధ్యం పాఠ్యాంశాలు బోధించాలి : ఎంఈఓ గజ్జెల కనకరాజు
Child laborers | బాల కార్మికులతో పనులు చేయిస్తే కఠిన చర్యలు : ఎస్ఐ మానస