Harish Rao | సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, SIR అవగాహన సదస్సుకు మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ తొలి నాళ్లలో కేసీఆర్ నిరాహార దీక్షకు వెళ్తుంటే.. ఆయనతో పాటే అలుగునూరు చౌరస్తాలో అరెస్టయి జైలు జీవితం గడిపిన గొప్ప నిబద్ధత గల నాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు. ఈ వయసులో కూడా పార్టీ కార్యక్రమానికి రావడం ఆయన అంకితభావానికి నిదర్శనమన్నారు.
హుస్నాబాద్ అంటే కేసీఆర్‌కు ఎంతో నమ్మకం. ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించేవారు. కేసీఆర్ సైకిల్ యాత్రకు బ్రహ్మరథం పట్టి, తొలి రోజుల్లోనే ఎంపీపీలు, జడ్పీటీసీలను గెలిపించిన గడ్డ ఇది.నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ కోసం మనం దీక్షలు చేశాం. కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే హుస్నాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా మార్చారు.ఎస్పీ, డీఎస్పీ, ఎలక్ట్రిసిటీ డీఈ ఆఫీసులు తెచ్చుకున్నాం. బస్టాండ్‌ను ఫుల్ ఫ్లెడ్జ్ డిపోగా మార్చారు. గౌరవెల్లి ప్రాజెక్టును, గండి మహాసముద్రం చెరువును అద్భుతంగా తీర్చిదిద్దారు.
SIR ఓటర్ల సర్వే విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదు..
SIR ఓటర్ల సర్వే విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు, కానీ అప్రమత్తంగా ఉండాలి. ఇది చనిపోయిన, డబుల్ ఓట్లను తొలగించి జాబితాను సవరించే ప్రక్రియ.అధికారికంగా ఇందులో పార్టీలకు భాగస్వామ్యం ఉంది. కాబట్టి బూత్ లెవెల్ ఆఫీసర్లు (అంగన్వాడీ టీచర్లు) ఇంటింటికి వచ్చేటప్పుడు మన బూత్ లెవెల్ ఏజెంట్లు వారి వెంట వెళ్లాలి. ఎవరైనా అధికారులు సహకరించకపోతే ఏఆర్ఓ, ఆర్డీఓలకు ఫిర్యాదు చేయొచ్చు. ఫ్యామిలీ గ్రూపింగ్ ఫారాలు, ఓటరు నమోదు ఫారాలు నింపడంలో ప్రజలకు మనమే దగ్గరుండి సహాయపడాలని హరీశ్ రావు కోరారు. కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ సానుభూతిపరుల ఓట్లు ఎక్కడా గల్లంతు కాకుండా ప్రతి కార్యకర్త బాధ్యతగా చూసుకోవాలి. ఒక్క ఓటు కూడా ఎన్నికల్లో క్రియాశీలకంగా మారుతుంది.
రాజశేఖర్ రెడ్డి హయాంలో 610 జీవో అమలు చేయకపోతే, పోతిరెడ్డిపాడు పెంచుతుంటే.. మనమే తెలంగాణ కోసం పదవులను తృణప్రాయంగా వదిలేసి రాజీనామాలు చేశాం. తెలంగాణ కోసం రాజీనామా చేయాలన్నప్పుడు ముందుగా స్పీకర్ కి రాజీనామాలు ఇచ్చింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రేవంత్ రెడ్డి మాత్రం ఒరిజినల్ కాపీ జేబులో పెట్టుకుని జిరాక్స్ కాపీ ఇచ్చి డ్రామాలు ఆడాడు. ఎలాంటి త్యాగం చేయని వ్యక్తి సీఎం అయ్యాడు.తెలంగాణ కోసం త్యాగాలు చేసింది బీఆర్ఎస్ అయితే..మోసాలు చేస్తోంది రేవంత్ రెడ్డి.గత ఎన్నికల్లో కృతజ్ఞతకు, ఆశకు మధ్య పోటీ జరిగితే.. కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు హామీలకు మోసపోయారు.కానీ రేవంత్ మోసగాడన్న నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది.ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ.2730 కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పి, కేవలం రూ.52 కోట్లు.. అది కూడా కరెంట్ బిల్లులు, జీతాలకే ఖర్చు చేశారు.ఒక్క ఎస్టీ యువకుడికి కూడా ఉపాధి కల్పించలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో సత్యవతి రాథోడ్ మంత్రిగా ఉండేవారు, ఇప్పుడు రేవంత్ క్యాబినెట్లో ఒక్క గిరిజన మంత్రి కూడా లేడు.దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ నిధులు ల్యాప్స్ కాకుండా ‘క్యారీ ఫార్వర్డ్’ విధానాన్ని కేసీఆర్ తెచ్చారు.
ఒక్క దళితుడికి కూడా లోన్ రాలేదు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ కింద 5403 కోట్లు కేటాయించినా ఒక్క దళితుడికి కూడా లోన్ రాలేదు. దళిత బంధు కింద 12 లక్షలు ఇస్తామన్న హామీ గాలికి పోయింది. బీసీ కార్పొరేషన్‌కు రూ.1370 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు.33 కుల కార్పొరేషన్లు పెట్టి, అందులో కాంగ్రెస్ నేతలకు కుర్చీలు ఇచ్చారు తప్ప బీసీలకు ఒరిగిందేమీ లేదు. కేసీఆర్ యాదవులకు గొర్రెలు, మత్స్యకారులకు ఏటా 100 కోట్లతో ఉచిత చేప పిల్లలు ఇస్తే.. కాంగ్రెస్ వాటన్నింటినీ బంద్ పెట్టింది. చేనేతన్నలకు బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫాం ఆర్డర్లు కేసీఆర్ ఇస్తే, రేవంత్ రెడ్డి ఆ ఆర్డర్లను గుజరాత్ కార్పొరేట్లకు కట్టబెట్టి నేతన్నల పొట్టగొట్టాడు. చేనేత సబ్సిడీలు ఆపేశాడన్నారు.
ఆరుట్ల స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పిల్లల ముందు కూడా రేవంత్ రెడ్డి రాజకీయాలు మాట్లాడుతున్నాడు
హరీష్ రావు తాటిచెట్టు లెక్క పెరిగాడు అని అక్కడ పిల్లల ముందు చెప్తున్నాడు
నా ఎత్తు గురించి ఆ పిల్లలకు ఎందుకు రేవంత్ రెడ్డి?
రైతుబంధు, రైతుభీమా, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వమంటే నా… pic.twitter.com/u6Y1T9g1dd
— Telugu Scribe (@TeluguScribe) June 17, 2026
Pawan Kalyan | అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానిని పరామర్శించిన పవన్ కల్యాణ్
KTR | పానీపూరి తిని అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలి : కేటీఆర్