రాయపర్తి, ఆగస్టు 16 : ఎస్సారెస్పీ కాల్వలకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌తో సోమవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాదయాత్ర చేపట్టనున్నారు. రాయపర్తి మండలంలోని మైలారం విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వ నుంచి ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ శ్రేణులు, రైతులతో కలిసి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని నాంచారిమడూరు వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
మైలా రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి దిగువ ప్రాం తాలకు సాగు నీటిని విడుదల చేయాలని సర్కారుపై ఒత్తిడి తేనున్నారు. పాదయాత్రకు పార్టీ శ్రేణులు, రైతులు అధిక సంఖ్యలో సకాలంలో హాజరై విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్ కోరారు. ఈ మేర కు ఆయన ఆదివారం మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అవుట్ ఫ్లో గేట్ల వద్ద ఎస్సారెస్పీ కాల్వ దుస్థితిని పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్, పూస మధు, పోగులకొండ వేణు, చందు రామ్ పాల్గొన్నారు.
దేవరుప్పుల/పాలకుర్తి : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బోనం ఎత్తి సందడి చేశారు. పోచమ్మ బోనాల్లో భాగంగా దేవరుప్పుల మండలం కోలుకొండ, పాలకుర్తి, ముత్తారం, వావిలాల గ్రామాల్లో ఆదివారం పోచమ్మ బోనాల పండుగ నిర్వహించారు. మహిళలు శోభాయాత్రగా బయలుదేరి తల్లికి బోనం పెట్టి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి ప్రత్యేక పూజలు చేశారు.
కార్యక్రమంలో సర్పంచ్‌లు స్రవంతి, విజయ, అనిత, పద్మ, మహేందర్, లక్ష్మణ్, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు దయాకర్, ప్రధాన కార్యదర్శి రవి, మాజీ అధ్యక్షుడు నవీన్, మాజీ ఎంపీపీ నాగిరెడ్డి, నాయకులు సోమేశ్వర్రావు, ఎల్లయ్య, గోపీ, మహేందర్, కర్ణాకర్‌రెడ్డి, శ్రీనివాస్, కుమారస్వామి, లింగయ్య, శోభన్‌బాబు, కృష్ణమూర్తి, శాంతయ్య, గజేందర్, రమ, హనుమంతరావు, మధు, యుగేంధర్, అర్జున్, మహ్మద్ ఖాసీం, ప్రవీణ్, మోహన్, ఇంద్ర స్వామి, యాకస్వామి, పరశురాములు, రామ్మూర్తి ఉన్నారు.