Bakki Venkataiah | తొగుట, నవంబర్ 16 : తెలంగాణ ఉద్యమకారుడు, ఘనపూర్‌కు చెందిన కొమ్ము కిషన్ అకాల మరణం బాధాకరమని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య విచారం వ్యక్తం చేశారు.. ఘనపూర్‌లో ఇటీవల మరణించిన కొమ్ము కిషన్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అలాగే ఘనపూర్‌లో ఇటీవల బీఆర్ఎస్ నాయకులు యాటెల్లి రాజు తండ్రి మరణించడంతో ఆయనను పరామర్శించారు. ఇటీవల ప్రమాదానికి గురైన బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త మంగలి యాదగిరితోపాటు సొసైటీ చైర్మన్ కే హరికృష్ణా రెడ్డిని బక్కి వెంకటయ్య పరామర్శించారు.
పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, నాయకులు చిలువెరి మల్లారెడ్డి, గురువా రెడ్డి, కుర్మ యాదగిరి, గంగనిగల్ల మల్లయ్య, కొమ్ము శరత్, భైరా గౌడ్, రాజశేఖర్, బాలయ్య,రామస్వామి, రాజు తదితరులు ఉన్నారు.

Akhanda 2 | నందమూరి అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. 3డీ ఫార్మాట్లో ‘అఖండ 2’
Rajkummar Rao | తల్లిదండ్రులైన బాలీవుడ్ స్టార్ దంపతులు
NBK 111 | బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబో రిపీట్.. ఈ నెలాఖరున కొత్త సినిమా ప్రారంభం!