Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Gajwel MRO | రైతు తనకేదైనా భూసమస్య ఉందంటే ఆ సమస్యను చెప్పినా.. ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకునే అధికారులు చాలా తక్కువగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక రైతు తన సమస్యను ఎమ్మార్వోకు విన్నవించుకుంటే.. అతడి సమస్యను పరిష్కరించడం మాట అటుంచితే ఆ రైతు పట్ల అవహేళనగా మాట్లాడితే ఎలా ఉంటుంది..
Gajwel MRO | కాంగ్రెస్ సర్కార్ హయాంలో రైతులు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఓ వైపు ఎల్‌నినో ప్రభావం, మరోవైపు యూరియా కొరత, కరెంట్ కోతలు.. ప్రభుత్వం సాగునీరు విడుదల చేయకపోవడం.. అన్నదాతలు ఇలా ఎన్నో రకాల సమస్యలతో దిక్కుతోచనిస్థితిలోకి వెళ్లిపోతున్నారు.
ఇక రైతు తనకేదైనా భూసమస్య ఉందంటే ఆ సమస్యను చెప్పినా.. ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకునే అధికారులు చాలా తక్కువగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక రైతు తన సమస్యను ఎమ్మార్వోకు విన్నవించుకుంటే.. అతడి సమస్యను ఎమ్మార్వో పరిష్కరించడం మాట అటుంచితే ఆ రైతు పట్ల అవహేళనగా మాట్లాడితే ఎలా ఉంటుంది.. అలాంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది.
భూమి సమస్యను పట్టుకుని తన కార్యాలయానికి వచ్చిన ఓ రైతన్నను గజ్వేల్ ఎమ్మార్వో నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా.. పురుగుల మందు తాగలేదా అని నవ్వుతూ మాట్లాడటం రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్‌కు, ప్రభుత్వంలో పనిచేస్తున్న రెవెన్యూ యంత్రాంగానికి ఎలాంటి చిన్న చూపు ఉందో మరోసారి చెప్పకనే చెబుతోంది.
ఓ రైతు ఒక సమస్య వల్ల తన వ్యవసాయ భూమి, తన బ్రతుకుతెరువును కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆశ్రయిస్తే ఎమ్మార్వో అవహేళనగా నవ్వుతూ మాట్లాడటం.. ఈ క్రమంలో సదరు రైతు నా పరిస్థితి చూస్తే మీకు నవ్వు వస్తుందా అని అడిగితే ఆ ఎమ్మార్వో అహంకారంగా అవును వస్తది బరాబర్ వస్తది అని సమాధానం చెప్పడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట రౌండప్ చేస్తోంది.
నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా.. పురుగుల మందు తాగలేదా..!
సమస్య ఉందని వెళ్లిన రైతుతో అవహేళనగా మాట్లాడిన గజ్వేల్ ఎమ్మార్వో
ఒక సమస్య వల్ల తన వ్యవసాయ భూమి తన బ్రతుకుతెరువును కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆశ్రయిస్తే అవహేళనగా మాట్లాడడమే కాకుండా, నా పరిస్థితి చూస్తే మీకు నవ్వు వస్తుందా అని అడిగితే అహంకారంగా అవును వస్తది బరాబర్ వస్తది అని సమాధానం చెప్పిన ఎమ్మార్వో
— Telugu Scribe (@TeluguScribe) October 10, 2026
Read Also :
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
- Tags
- farmer
- Gajwel MRO
- poison
- Siddipeta
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

