Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Nara Lokesh | రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Nara Lokesh | రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కూడా ట్రైలర్‌ను వీక్షించి చిత్ర బృందాన్ని అభినందించారు.‘రణబాలి’ ట్రైలర్ చూసిన అనంతరం నారా లోకేష్ సామాజిక మాధ్యమాల వేదికగా తన స్పందనను తెలియజేశారు.
19వ శతాబ్దంలో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొన్న బ్రిటిష్ పాలకుల అణచివేత, కరవు పరిస్థితులను తెరపై ఆవిష్కరించిన తీరును ఆయన ప్రశంసించారు. రాయలసీమకు చెందిన యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకుందని పేర్కొన్నారు. రష్మిక మందన్న పాత్ర కూడా కథకు కీలకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. చరిత్రలో మరుగునపడిపోయిన వీరోచిత పోరాటాన్ని వెండితెరపైకి తీసుకొస్తున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ను అభినందించారు. అక్టోబర్ 16న విడుదల కానున్న ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. నారా లోకేష్ ప్రశంసలతో ‘రణబాలి’ ట్రైలర్‌పై మరింత ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు, డాక్యుమెంటరీ తరహా ప్రచార కార్యక్రమాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా విడుదలైన 3 నిమిషాల 47 సెకన్ల ట్రైలర్లో విజయ్ దేవరకొండను మునుపెన్నడూ చూడని రీతిలో చూపించారు. రాయలసీమ యాస, ఆవేశభరితమైన సంభాషణలు, పోరాట సన్నివేశాలతో ఆయన పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ‘శింగనమల బొబ్బిలి రణబాలి’ అనే యోధుడి పాత్రలో కనిపించనున్నారు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలన నేపథ్యంలో కథ సాగుతుందని ప్రచార చిత్రాలు సూచిస్తున్నాయి. పన్నుల భారం, ఆకలి కేకలు, ప్రజలపై అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే యోధుడి కథాంశం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. విజయ్ దేవరకొండకు జోడీగా రష్మిక మందన్న జయమ్మ పాత్రలో కనిపించనున్నారు. విజయ్, రష్మిక జంట మరోసారి తెరపై కనిపించనుండటంతో అభిమానులు ఈ చిత్రంపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు.
Just saw the trailer of #Ranabali and wow, what an immersive experience! The detailing in recreating 1800s Rayalaseema and capturing that heart-wrenching era of British-era famine and oppression is phenomenal.
@TheDeverakonda looks effortlessly fierce and completely at home in the soil of Seema, brilliantly anchored by @iamRashmika. Kudos to @Rahul_Sankrityn and the entire team for bringing such a powerful, untold chapter of history to life. Wishing you all huge success on October 16!
https://t.co/lHlmpxca8u
— Lokesh Nara (@naralokesh) October 10, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Rayapol SI | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు.. రాయపోల్ ఎస్ఐ స్ట్రాంగ్ వార్నింగ్
Abhijeet Dipke: విమానంలోనే దీప్కే అరెస్టు..
Accident | వలస కూలీల ట్రాక్టర్‌ను ఢీకొన్న టిప్పర్.. ఒకరు మృతి, 32 మందికి గాయాలు!
Salman Khan | యూట్యూబ్‌లో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్.. కోచ్‌గా, స్టూడెంట్‌గా భాయ్ సందడి!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

