Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Earthquake | ఉత్తర, దక్షిణ అమెరికాల మధ్య ఉన్న గణతంత్ర పనామా (Panama) దేశంలో శుక్రవారం భారీ భూకంపం (Earthquake) చోటుచేసుకుంది. దేశ దక్షిణ తీర ప్రాంతంలో 7.6 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దాంతో అధికారులు వెంటనే పసిఫిక్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు (Tsunami Alert) జారీచేశారు.
Earthquake : ఉత్తర, దక్షిణ అమెరికాల మధ్య ఉన్న గణతంత్ర పనామా (Panama) దేశంలో శుక్రవారం భారీ భూకంపం (Earthquake) చోటుచేసుకుంది. దేశ దక్షిణ తీర ప్రాంతంలో 7.6 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దాంతో అధికారులు వెంటనే పసిఫిక్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు (Tsunami Alert) జారీచేశారు. అయితే ఆ తర్వాత ప్రమాదం తప్పిందని నిర్ధారించి సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు.
అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం.. పిటలోజా అరిబా సమీపంలో భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంప తీవ్రతను తొలుత 8.0 గా అంచనా వేశారు. కానీ ఆ తర్వాత 7.6 కు సవరించారు. ఈ భూకంపం ధాటికి పనామా నగరంలోని భవనాలు కంపించాయి. పొరుగున ఉన్న కోస్టారికా దేశ రాజధానిలోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
భయంతో ప్రజలు ఇళ్ల నుంచి కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. పెనోనోమే నగరంలోని ఒక కేథడ్రల్ టవర్ కూలిపోయిందని, మరికొన్ని నిర్మాణాలకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భూకంపం సంభవించిన వెంటనే యూఎస్ సునామీ వార్నింగ్ సిస్టమ్ పనామా, కొలంబియా, ఈక్వడార్ సహా మధ్య అమెరికా పసిఫిక్ తీరాలకు సునామీ హెచ్చరికలు జారీచేసింది.
కొన్ని చోట్ల 1 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడవచ్చని అంచనా వేసింది. అయితే కొంతసేపటి తర్వాత పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ పరిస్థితిని సమీక్షించి, పెద్ద ప్రమాదం ఏమీ లేదని ప్రకటించింది. దాంతో సునామీ హెచ్చరికలను ఎత్తివేశారు. ప్రధాన భూకంపం తర్వాత 6.6 తీవ్రతతో సహా పలుమార్లు భూమి కంపించింది. ఈ ఘటనలో ప్రాణనష్టంపై వెంటనే స్పష్టత రాలేదని, కొందరికి గాయాలయ్యాయని స్థానిక అధికారులు తెలిపారు.
ప్రజలు సంయమనం పాటించాలని పనామా అధ్యక్షుడు జోస్ రాఉల్ ములినో కోరారు. పనామా కెనాల్ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. ప్రస్తుతం అధికారులు నష్టాన్ని అంచనావేసే పనిలో ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Rayapol SI | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు.. రాయపోల్ ఎస్ఐ స్ట్రాంగ్ వార్నింగ్
Abhijeet Dipke: విమానంలోనే దీప్కే అరెస్టు..
Accident | వలస కూలీల ట్రాక్టర్‌ను ఢీకొన్న టిప్పర్.. ఒకరు మృతి, 32 మందికి గాయాలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

