భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
భువనగిరి అరోరా కాలేజీ హాస్టల్లో విద్యార్థినుల ఫొటోలు, వీడియోలకు సంబంధించిన వ్యవహారం కలకలం రేపింది. వైరల్ ఆడియో, వాట్సాప్ చాట్ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగగా పోలీసులు విచారణ చేపట్టారు.
భువనగిరి, అక్టోబర్ 10: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని అరోరా కళాశాలలో విద్యార్థినుల ఫొటోలు, వీడియోలకు సంబంధించిన వ్యవహారం కలకలం రేపింది. కళాశాల హాస్టల్ మెస్ ఇన్‌ఛార్జి పృథ్వీ, వార్డెన్ రేవతి మధ్య జరిగినట్లు చెబుతున్న వాట్సాప్ చాట్ వైరల్‌గా మారింది. దీనికి తోడు కళాశాలలో జరుగుతున్న పరిణామాలపై ఓ విద్యార్థి తన తండ్రితో మాట్లాడిన ఫోన్ కాల్ వాయిస్ రికార్డు కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న వాయిస్ రికార్డులో మెస్ ఇన్‌ఛార్జి పృథ్వీ కళాశాల విద్యార్థినుల ఫొటోలు, వీడియోల గురించి అదే కాలేజీ విద్యార్థులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. కాలేజీ అమ్మాయిల ఫొటోలు, వీడియోలు కావాలంటే చెప్పండని వారికి చెప్పినట్లుగా ఆ రికార్డుల్లో వెల్లడైంది.
కళాశాల ఎదుట ఆందోళన
ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో కొందరు కళాశాల ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడి వారిని సముదాయించారు.
ఈ ఘటనపై భువనగిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు అందినట్లు తెలిసింది. మెస్ ఇన్‌ఛార్జి పృథ్వీ, వార్డెన్ రేవతిని విడివిడిగా పిలిపించి విచారించినట్లు పోలీసులు వెల్లడించారు. వారి ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విచారణ అనంతరం చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
నాన్న.. వార్డెన్‌తో ఆమెకి లింక్ ఉంది: స్టూడెంట్ ఆడియో వైరల్
భువనగిరి అరోరా కళాశాల హాస్టల్ మెస్ ఇంఛార్జి, వార్డెన్ మధ్య లింక్ ఉంది అంటూ.. విద్యార్థి తన తండ్రితో మాట్లాడిన ఫోన్ కాల్ వైరల్
కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన#Bhuvanagiri #AuroraCollege #StudentProtest #Audioviral #bigtv
— BIG TV Breaking News (@bigtvtelugu) October 10, 2026
కళాశాలను నమ్మి తమ కుమార్తెలను హాస్టల్లో చేర్పిస్తే.. సిబ్బందిపై ఇలాంటి ఆరోపణలు రావడం ఏమిటని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే పలువురు విద్యార్థినులు హాస్టల్ నుంచి తమ ఇళ్లకు వెళ్లిపోయినట్లు విద్యార్థి వాయిస్ రికార్డులో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Rayapol SI | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు.. రాయపోల్ ఎస్ఐ స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

