Spot Admissions | తొగుట, జూలై 29 : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికిగాను ఎంపీసీ, బైపీసీ గ్రూప్ నందు మొదటి సంవత్సరంలో మిగిలిపోయిన ఇంటర్మీడియట్ సీట్లకు కార్యదర్శి ఆదేశాల మేరకు ఈ నెల 31వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అజ్మాత్ బేగం తెలియజేశారు.
ఈ విషయమై అజ్మాత్ బేగం మాట్లాడుతూ.. పాత మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి, 2025 మార్చి పదవ తరగతి మొదటి అటెంప్ట్‌లో పాస్ అయినటువంటి విద్యార్థినిలు జులై 31వ తేదీ రోజు తొగుట గురుకుల పాఠశాలలో ఉదయం 9 గంటల నుండి 1:00 వరకు అప్లికేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. తర్వాత 2:00 గంటల నుండి మెరిట్ ప్రకారం స్పాట్ అడ్మిషన్ల కౌన్సిలింగ్ నిర్వహించబడుతుందని తెలియజేశారు.
అడ్మిషన్లు కోరుకునే విద్యార్థినులు ఒరిజినల్ కుల, ఆదాయ ధ్రువపత్రాలు, పదవ తరగతి ఆన్లైన్ మెమో, టీసీ, బోనాఫైడ్లతోపాటు ఆధార్‌తోపాటు పైన పేర్కొన్నఅన్ని సర్టిఫికెట్లు జిరాక్స్ తీసుకురావాలని కోరారు. మరిన్ని వివరాల కోసం కనెంబర్ కి 9704550254 కు సంప్రదించాలని తెలియజేశారు.
Nalgonda : నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
YS Jagan | రెడ్‌బుక్ తరహాలో వైసీపీ యాప్.. వాళ్లందరికీ సినిమా చూపిస్తానని వైఎస్ జగన్ వార్నింగ్
Watch: స్కూటర్‌ను ఢీకొట్టిన వాహనం.. ఆపై రివర్స్‌లో వచ్చి వృద్ధుడ్ని ఢీ