ACP Narsimlu | రాయపోల్ జూన్ 09. అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని. ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని గజ్వేల్ ఏసీపీ నర్సింలు ఆన్నారు. సోమవారం సిద్ధిపేట జిల్లా రాయపోల్, దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్లను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజాబుల్ పోలింగ్ విధులు నిర్వహించాలన్నారు.
పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యను పరిష్కరించాలన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సిబ్బందికి సుచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలు, వివిధ నేరాలలో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు. వర్టికల్ వారీగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రతి దరఖాస్తుదారునితో మాట్లాడి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలిపారు. అధికారులు, సిబ్బంది సమిష్టిగా సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి, మహిళల రక్షణకు పెద్దపీట వేయాలని సూచించారు. సీజ్ చేసిన వాహనాలను సంబంధిత వాహన యజమానులకు సాధ్యమైనంత త్వరగా అందజేయాలని సూచించారు. వీపీఓ వ్యవస్థను మెరుగుపరచాలని వారంలో రెండు, మూడు సార్లు గ్రామాలను సందర్శించాలని సిబ్బందికి, అధికారులకు సూచించారు.
విధి నిర్వహణలో అలసత్వం వహించవద్దు..
ప్రతీ కేసులో పారదర్శకంగా పరిశోధన కొనసాగాలని తెలిపారు. కేడీలు, డిసీలు, అనుమానితులు, రౌడీలపై మరింత నిఘా ఉంచాలని తెలిపారు. అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహించవద్దని తెలిపారు, రోడ్డు ప్రమాదాలను నివారణ గురించి ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాహనాల తనిఖీ నిర్వహించి హెల్మెట్, సీట్ బెల్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇన్సూరెన్స్ తదితర అంశాలపై వాహనదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు.
గ్రామాలను సందర్శించినప్పుడు గ్రామాలలో ఏం జరుగుతుంది..? ఏం జరగబోతుందని ముందస్తు సమాచారం సేకరించాలని తెలిపారు. ప్రోయాక్టివ్ పోలీసింగ్ విధులు నిర్వహించాలన్నారు. సైబర్ నేరాలు, తదితర అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు, ఇసుక, పీడీఎస్ రైస్, గంజాయి ఇతర మత్తు పదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు.
గ్రామాలను సందర్శించినప్పుడు గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, బెట్టింగ్, సైబర్ నేరాల గురించి ప్రజలకు, యువతీయువకులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తొగుట సీఐ లతీఫ్, రాయపోల్ ఎస్ఐ రఘుపతి, దౌల్తాబాద్ ఎస్ఐ ప్రేమ్ దీప్, రెండు పోలీస్ స్టేషన్ల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Gudem Mahipal Reddy | అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: పటాన్చెరు ఎమ్మెల్యే
Naresh | ఏడుపాయల వన దుర్గమ్మ సేవలో నరేష్..