Albendazole Tablets | దౌల్తాబాద్, ఆగస్టు 11 : జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పిల్లలకు ఆల్బెండజోల్ టాబ్లెట్లను మెడికల్ ఆఫీసర్ నాగరాజు, మండల విద్యాధికారి గజ్జల కనకరాజ్ పంపిణీ చేశారు. 1 నుండి 19 సంవత్సరాలలోపు పిల్లల్లో నులిపురుగుల సమస్య నివారణకు, ఆహార జీర్ణక్రియ మెరుగుదలకు, శారీరక వికాసానికి ఈ మాత్రలు ఉపయోగపడతాయని వైద్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డా. నాగరాజు పిల్లలకు స్వయంగా నులి పురుగు మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నులిపురుగులు పిల్లల ఆరోగ్యానికి ముప్పుగా మారతాయి. సమయానికి డీవార్మింగ్ చేస్తే రక్త హీనత, పోషకాహార లోపం వంటి సమస్యలు తగ్గుతాయన్నారు. ఆస్పత్రి సిబ్బంది తల్లిదండ్రులు పిల్లలకు ఈ మాత్రలు తప్పక ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గఫూర్ కాద్రితోపాటు వైద్య సిబ్బంది, తల్లిదండ్రులు, పిల్లలు పాల్గొన్నారు.
urea | గన్నేరువరంలో యూరియా కోసం బారులు తీరిన రైతులు
Farmers concern | యూరియా కొరతపై రైతుల ఆందోళన.. పోలీసుల పహారాలో పంపిణీ
Karepalli | కారేపల్లి మండలంలో నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ