Rayapole Mandal | రాయపోల్, డిసెంబర్ 04 : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలో 19 గ్రామ పంచాయతీలకుగాను రెండు జీపీలు ఏకగ్రీవమయ్యాయి. ఆరేపల్లి గ్రామంలో ఒకే అభ్యర్థి నామినేషన్ వేయడంతో ఏకగ్రీవమైనది. కొత్తపల్లి గ్రామంలో ఇద్దరు నామినేషన్ వేయగా.. ఒకరు ఉపసంహరించుకోగా సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవమైనది.
17 గ్రామ పంచాయతీలలో 51 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 166 వార్డు సభ్యులకు 372 నామినేషన్లు రాగా, 28 మంది విత్ డ్రా చేసుకున్నారు, 134 వార్డులకు 312 మంది బరిలో ఉన్నారు.
పల్లెల్లో వేడేక్కిన రాజకీయం…
గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలంతో గ్రామాల్లో వేడేక్కింది. నామినేషన్లు, పరిశీలన, విత్ డ్రా బుధవారం సాయంత్రం ముగిసింది. ఆయితే సంబంధిత గ్రామాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించారు. దీంతో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల వాతావరణం వేడేక్కింది.
ఎన్నికల్లో పోటీచెస్తున్న అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రాయపోల్ మండలంలో 19 జీపీలుండగా.. అందులో రెండు జీపీలు అయిన పెద్ద ఆరేపల్లి, కొత్తపల్లి గ్రామ పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. మరో 17, జీపీలలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
Mahabubabad | లారీని ఢీ కొన్న బైక్.. రైల్వే ఉద్యోగి మృతి
Jyotiraditya Scindia: సంచార్ సాథీ యాప్‌తో స్నూపింగ్ జరగదు: లోక్‌సభలో మంత్రి సింథియా