Paddy Fields | రాయపోల్, మార్చి 26 : పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలు కిందికి వంగి ప్రమాదకరంగా ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ స్తంభంతోపాటు వైర్లు కిందికి వేలాడుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని రైతులు భయాందోళన గురవుతున్నారు.
రాయపోల్, తిమ్మక్కపల్లి గ్రామాల మధ్య అనాజీపూర్ చెరువు ప్రక్కన ఉన్న పొలాలకు రైతులు ఆ దారి నుంచి వెళ్లాలంటే జంకుతున్నారు. నిత్యం అదే రూట్లో వస్తున్న విద్యుత్ అధికారులు చూసి చూడనట్లు వివరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. పైన 11 కేవీ విద్యుత్ స్తంభం ఒరిగి ఉండగా.. పైన 11 కేవీ విద్యుత్ వైరు ఉండడంతో ఎప్పుడు విద్యుత్ ప్రమాదాలు జరుగుతాయో అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు.
వైర్లు కిందికి ఉండడంతో రైతులు అటువైపు పోవడానికి భయపడుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి ఒరిగిన విద్యుత్ స్తంభాన్ని సరిచేసి కిందికి వేలాడుతున్న విద్యుత్ వైర్లను మరమ్మతు చేసి ప్రమాదాలు జరగక ముందే మరమ్మతులు చేపట్టాలని రైతులు పేర్కొంటున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ఈ దుస్థితి నెలకొందని రైతులు ఆరోపిస్తున్నారు.
BRS : కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ అండ : రావులపల్లి రాంప్రసాద్
TTD | టీటీడీకి తిరుమల విద్యా సంస్థల చైర్మన్ భారీ విరాళం
Road Accident | సికింద్రాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి