Foot Ball Tournament | జహీరాబాద్ , ఏప్రిల్ 14 : జహీరాబాద్ పట్టణానికి చెందిన యువ క్రీడాకారుడు జాతీయస్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్‌కు ఎంపికయ్యాడు. స్థానిక పట్టణంలోని క్రిస్టియన్ కాలనీకి చెందిన అమృత్ టీచర్ కుమారుడు అలెక్స్ హోలీ ఫీల్డ్ (17) స్రవంతి జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుకుంటున్నాడు.
ఈ క్రమంలో యువకుడు పట్టుదలతో ఫుట్ బాల్ ఆట ఆడుతూ ఎన్నో పథకాలను సాధించాడు. అతని ప్రతిభను గుర్తించిన జిల్లా అధికారులు ఉమ్మడి మెదక్ జిల్లా నుండి జాతీయస్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్‌కు ఎంపిక చేశారు. ఈ నెల 15 నుండి 21 వరకు మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న జాతీయ స్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు అలెక్స్ ఇవాళ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి బయలుదేరి వెళ్లాడు.
అలెక్స్ ఈ టోర్నమెంట్లో మరింతగా రాణించి కప్‌ను సాధించాలని తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకులు, స్నేహితులు ఆశాభావం వ్యక్తం చేశారు.