Ganja | ఝరాసంగం, జూన్ 22: యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలవుతూ తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని ఎస్ఐ మల్లేశ్వర్ అన్నారు. యాంటీ-డ్రగ్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఆదివారం ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామంలో మత్తుపదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, చట్టపరమైన చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.
ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఈదమ్మ గుడి నుంచి పంచాయతీ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గుండప్ప, పోలీసు సిబ్బంది శ్రీనివాస్, భరత్ రెడ్డి, సత్యనారాయణ, గ్రామస్థులు పాల్గొన్నారు.
Peddagattu | జీఓ ఇచ్చారు.. నిధులు మరిచారు.. కాంగ్రెస్ హయాంలో లింగమంతుల స్వామికి శఠగోపమేనా?
Bigg Boss 9 | బిగ్ బాస్ సందడికి టైం ఫిక్స్ అయినట్టేనా.. కంటెస్టెంట్స్ ఎవరెవరంటే..!
Road Accident | వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి..