Govt Pensioners | రామచంద్రాపురం : రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం రామచంద్రపురం డివిజన్ పరిధిలో గల ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘం రామచంద్రపురం యూనిట్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో నిర్మించిన పెన్షనర్ల సంక్షేమ సంఘం భవనం ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదని సభ్యులు తన దృష్టికి తీసుకొని రావడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇదే భవనంలో గల రామచంద్రాపురం ప్రెస్ క్లబ్ సభ్యులతో చర్చించి మరో అంతస్తు నిర్మించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తాన్ని పెన్షనర్ల సంక్షేమ సంఘానికి కేటాయించడంతోపాటు.. నూతనంగా 30 లక్షల రూపాయలతో నిర్మించబోయే పై అంతస్తులో ప్రెస్ క్లబ్‌కు కార్యాలయం నిర్మించి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించి త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
ఎంతో అనుభవం గల ప్రభుత్వ పెన్షనర్లు నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తూ అనునిత్యం అండగా నిలుస్తున్న ఎమ్మెల్యేను పెన్షనర్ల ఉద్యోగుల సంఘం ఘనంగా సన్మానించింది. ఈ సమావేశంలో కార్పోరేటర్ పుష్ప నాగేష్, పెన్షనర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాములు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
Koppula Eshwar | కర్ర శ్రీహరికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
Rayapole | ‘తాపీ కార్మిక సంఘం లేకపోవడంతో కార్మికులకు అనేక ఇబ్బందులు’
Nizampet | యూరియా కోసం బారులు తీరిన రైతులు