Water Purifier plants | నిజాంపేట్, జూలై 29 : గ్రామాల్లో స్వచ్ఛమైన శుద్ధ జలాలు అందించేందుకు ఎమ్మెల్సీ కోటా కింద శుద్ధ జలాల ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ప్రజల దాహార్తి తీర్చేందుకు గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సీడీపీ ఎమ్మెల్సీ కోటా కింద రూ.5 లక్షల చొప్పున ఖర్చు పెట్టి శుద్ధ జలాలను సరఫరా చేసేందుకు ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అవి ప్రస్తుతం నిరుపయోగంగా ఉంటున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నిరుపయోగంగా మారాయి.
వీటి వివరాలు పరిశీలిస్తే.. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని నాగధర్ గ్రామంలో రెండు చోట్ల ఎమ్మెల్సీ కోటా కింద నియోజకవర్గం అభివృద్ధి నిధులతో రూ.5 లక్షల చొప్పున రెండు శుద్ధ జలాల ప్లాంట్లను మంజూరు చేయగా.. గుత్తేదారులు శుద్ధ జలాల ప్లాంట్లను ఏర్పాటు చేసినా ఆయా గ్రామ పంచాయతీలు వినియోగించుకోవడంలో విఫలమయ్యాయి. దీంతో రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన శుద్ధ జలాల ప్లాంట్లు నిరుపయోగంగా ఉన్నాయి.
అధికారులు ఇప్పటికైనా స్పందించి శుద్ధ జలాల ప్లాంట్లను వినియోగంలోకి తీసుకురావాలని.. ఆయా గ్రామాల ప్రజలకు శుద్ధ జలాల తాగునీటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు.
Nalgonda : నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
YS Jagan | రెడ్‌బుక్ తరహాలో వైసీపీ యాప్.. వాళ్లందరికీ సినిమా చూపిస్తానని వైఎస్ జగన్ వార్నింగ్
Watch: స్కూటర్‌ను ఢీకొట్టిన వాహనం.. ఆపై రివర్స్‌లో వచ్చి వృద్ధుడ్ని ఢీ
.