SUicide | చాలా ఇష్టంగా పెంపుడు జంతువులను పెంచుకునేవాళ్లు ఉంటారని తెలిసిందే. అయితే పెంపుడు జంతువుల పట్ల చూపించే ప్రేమకు కూడా కొన్ని హద్దులుండాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఆ మితిమీరిన ప్రేమ ప్రాణాల మీదికొస్తుంది. అలాంటి ఘటనే మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.
మీర్పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఉంటున్న హిమబిందు (20) బీఎస్సీ చదువుతోంది. హిమబిందు గత రెండు సంవత్సరాలుగా పిల్లిని ఎంతో ఇష్టంగా పెంచుకొని, గారాబంగా చూసుకుంటుంది. అయితే హిమబిందుకెంతో ఇష్టమైన పిల్లి చనిపోయింది. దీంతో హిమబిందు తీవ్రమనస్తాపానికి లోనైంది. పిల్లి మృతి చెందిన విషయాన్ని జీర్ణించుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు హిమబందును దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు నిర్దారించారు.
హిమబిందు తీసుకున్న నిర్ణయం పట్ల నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఒకటి చనిపోతే ఇంకో పిల్లిని తీసుకొచ్చి పెంచుకోవచ్చు కానీ.. ఇలా ప్రాణాలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పెంపుడు జంతువులతో బాండింగ్ ఏర్పడితే మనుషుల కంటే ఎక్కువగా ప్రేమిస్తామని.. కానీ పిల్లి కోసం ఇలా చనిపోవడం సరికాదని కామెంట్స్ పెడుతున్నారు.
PM Modi | తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, గవర్నర్
Ustaad Bhagat Singh | ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రివ్యూ.. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఎలా ఉంది.!