Assam Elections : అస్సాం (Assam) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కు సంబంధించి బీజేపీ (BJP) తన అభ్యర్థుల తొలి జాబితా (First list) ను విడుదల చేసింది. మొత్తం 88 మంది అభ్యర్థుల పేర్లను పేర్కొంది. అస్సాం ముఖ్యమంత్రి (Assam CM) హిమంత బిశ్వశర్మ (Himantha Biswa Sarma) జాలుక్బారీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇది ఆయనకు కంచుకోటగా మారింది. 2001, 2006, 2011, 2016, 2021 ఎన్నికల్లో హిమాంత ఇక్కడి నుంచే విజయం సాధించారు.
ఇక, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కీలక నేతల పేర్లు కూడా తాజా జాబితాలో ఉన్నాయి. ఇటీవల బీజేపీలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభాగం మాజీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా బిహ్పురా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఇక బుధవారం కాంగ్రెస్ను వీడి కాషాయం కండువా కప్పుకున్న ప్రద్యుత్ బోర్డోలోయ్ డిస్పూర్ నుంచి పోటీ చేయనున్నారు. కాగా 126 అసెంబ్లీ స్థానాలు ఉన్న అస్సాంలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.