KTR Birthday | సౌత్ ఆఫ్రికాలో ఘనంగా కేటీఆర్ జన్మదిన సేవా కార్యక్రమాలు
KTR Birthday | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను దక్షిణాఫ్రికా లోని పలు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ( KTR Birthday ) జన్మదిన వేడుకలను దక్షిణాఫ్రికాలో (South Africa )ని పలు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ ( BRS NRI ) ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో నిర్వహించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా నాయకులు నాగరాజు గుర్రాల ఆధ్వర్యంలో గౌటెంగ్ (జోహన్నెస్‌బర్గ్), వెస్టర్న్ కేప్ (కేప్‌టౌన్), క్వాజులు-నటాల్ (పియెటర్మారిట్జ్బర్గ్) రాష్ట్రాల్లో ఒకే రోజు, ఒకే సమయంలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా అనాథాశ్రమాలను సందర్శించి చిన్నారులకు బియ్యం, కిరాణా సరుకులు, ఆహార పదార్థాలు, పరిశుభ్రత సామగ్రి, ఇతర నిత్యావసర వస్తువులతో పాటు వెచ్చని దుప్పట్లను పంపిణీ చేశారు. జోహన్నెస్‌బర్గ్ లోని గౌటెంగ్‌లో అరవింద్ ప్రసాద్ చీకోటి ఆధ్వర్యంలో , కేప్‌టౌన్ – వెస్టర్న్ కేప్ లో చేతన్ కొరబోయిన ఆధ్వర్యంలో , పియెటర్మారిట్జ్బర్గ్ – క్వాజులు-నటాల్ లో సంతోష్ కుమార్ ధీకొండ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించారు.

బీఆర్ఎస్ నాయకులు నరేందర్ రెడ్డి, అరవింద్ ప్రసాద్ చీకోటి, సాయి కిరణ్ నల్లా, రవీందర్ రెడ్డి, కిరణ్ కుమార్ బెల్లి, వూరె వంశీ, లక్ష్మణ్ రెడ్డి, విక్రమ్ పెట్లూరు తదితరులు పాల్గొని కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
Stock Market | దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. 1534 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. ఒక్కరోజే 2 శాతంపైగా లాభం
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

