Delhi Capitals : పంతొమ్మిదో సీజన్ ఐపీఎల్ పండుగకు మరో తొమ్మిది రోజులే ఉంది. ఇప్పటికే పది జట్ల ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడ్చుతూ మేము సిద్ధం అని అంటున్నారు. మరోవైపు కొన్ని ఫ్రాంచైజీలు కోచింగ్ యూనిట్‌ను బలోపేతం చేసుకుంటున్నాయి. స్వదేశీయుల కంటే విదేశీ కోచ్‌లనే ఏరికోరి కోచింగ్ బాధ్యతలు అప్పగిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) సైతం అదే ఫార్ములాను అనుసరిస్తూ.. ఐర్లాండ్ దిగ్గజం జాన్ మూనీ (John Mooney)ని ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది.
ఐపీఎల్ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లలో ఫీల్డింగ్ నైపుణ్యాల మెరుగుపరిచేందుకు కొత్త కోచ్‌ను నియమించింది. ఈ విషయాన్ని గురువారం ఢిల్లీ యాజమాన్యం ఎక్స్ వేదికగా వెల్లడించింది. ‘పటిష్టమైన ఢిల్లీ డిఫెన్స్‌కు కొద్దిగా ఐరిష్ స్టీల్ జత చేద్దాం.. జాన్ మూనీ స్వాగతం’ అంటూ ఎక్స్‌లో ఫ్రాంచైజీ పోస్ట్ పెట్టింది.
Adding some Irish steel to the Dilli defence 🛡️
Welcome, John Mooney! 💙❤️ pic.twitter.com/P3KEndk1mj
— Delhi Capitals (@DelhiCapitals) March 19, 2026
ఐర్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ జాన్ మూనీకి ఫీల్డింగ్ కోచ్‌గా తీసుకుంది. 44 ఏళ్ల మూనీకి టీ20లో కోచ్‌గా సుదీర్ఘ అనుభవముంది. 2015లో వీడ్కోలు అనంతరం ఇంగ్లండ్ బోర్డు నుంచి లెవల్ 1, 2, 3 కోచింగ్ కోర్సులు పూర్తి చేసిన మూనీ.. 2018 నుంచి 2019 వరకూ అఫ్గనిస్థాన్ ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందించాడు. అనంతరం వెస్టిండీస్ జట్టుకు సైతం పని చేసిన అతడు.. ఐర్లాండ్ మహిళల జట్టుకూ కోచ్‌గా వ్యవహరించాడు.
FLASH: Delhi Capitals name John Mooney as new fielding coach.#DelhiCapitals #Johnmooney @fieldingcoach pic.twitter.com/EYU9LM27wh
— Sports Today (@SportsTodayofc) March 19, 2026
పొట్టి క్రికెట్లో ఫీల్డింగ్ కోచ్‌గా రాణిస్తున్న మూనీని ఢిల్లీ క్యాపిటల్స్ తమ గూటికి చేర్చుకుంది. గత సీజన్లో కోచ్‌గా వ్యవహరించిన ఆంటోన్ రౌక్స్, జ్ఞానేశ్వర రావ్ స్థానంలో ఈ ఐర్లాండ్ వెటరన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. హెడ్‌కోచ్‌గా హేమంగ్ బదాని, బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్, అసిస్టెంట్ కోచ్‌లు ఇయాన్ బెల్, వేణుగోపాల్ రావులతో కలిసి మూనీ పని చేయనున్నాడు. గత సీజన్లో పేలవ ప్రదర్శనతో ఐదో స్థానంలో నిలిచిన ఢిల్లీ.. ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటోంది. అయితే.. నిరుడు డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్, మెంటార్‌గా ఉన్న కెవిన్ పీటర్సన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.